MLA Rajasingh : కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఏడాదే అంటూ రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
ఏడాది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని అన్నారు
- Author : Sudheer
Date : 06-12-2023 - 4:50 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ (Telangana) లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఉండేది ఏడాది కాలం మాత్రమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh). ఏడాది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని అన్నారు. కేసీఆర్ చేసిన అప్పులు తీర్చే క్రమంగా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆరు గ్యారంటీలను అమలు చేయడం సాధ్యం కాదన్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలే కట్టలేకపోతున్నారు. పథకాల అమలుకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తారన్నారు. రాజ్యాంగాన్ని కేసీఆర్ మారుస్తానంటే ప్రజలు కేసీఆర్‌నే మార్చారన్నారు. కేసీఆర్ అప్పులు చేసి వెళ్లారని.. అప్పులు పూడ్చడంతోనే కాంగ్రెస్‌కు సరిపోతుందన్నారు. తెలంగాణను నడపాలంటే ఒక్క బీజేపీతోనే సాధ్యమన్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అన్నారు. దేశంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అందరూ నివాళులర్పిస్తున్నారని.. వాళ్లు గర్వంగా జీవించడానికి.. వాళ్లకు న్యాయం జరగడానికి అంబేద్కర్ కారణమని రాజా సింగ్ తెలిపారు. అందుకే అన్ని వర్గాలు అంబేద్కర్‌ను స్మరించుకుంటాయని పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
గత పదేళ్లలో కేసీఆర్ పాలన గురించి ప్రస్తావిస్తూ.. తెలంగాణలో రావణ రాజ్యం అంతమైందని రాజా సింగ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ రావణుడు అని.. తెలంగాణ ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు. ఎస్సీలను కేసీఆర్ మోసం చేశారన్నారు. దళితులను ముఖ్యమంత్రి చేస్తామని.. మూడెకరాల భూమి, దళిత బంధు ఇస్తామని చెప్పి కేసీఆర్ మోసం చేసినట్లు వివరించారు. అంబేద్కర్‌కు కేసీఆర్ ఎప్పుడూ నివాళులర్పించలేదన్నారు. బీజేపీ ఒత్తిడితోనే హైదరాబాద్‌లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారన్నారు. ఎస్సీ సమాజాన్ని మోసం చేసి కేసీఆర్ ఫాంహౌస్‌లో కూర్చున్నాడని.. కేసీఆర్‌ను, ఆయన కుటుంబాన్ని ప్రజలు బహిష్కరించారని రాజా సింగ్ విమర్శలు చేశారు.
Read Also : Kothagudem Rains: కొత్తగూడెంలో భారీ వర్షం: ఖమ్మంలో ఇద్దరు మృతి