Telangana: రామప్ప ఆలయంలో రాహుల్. ప్రియాంక ప్రత్యేక పూజలు
తెలంగాణలో మూడు రోజుల పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్ర నేతలు ప్రియాంక గాంధీ , రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రియాంక, రాహుల్ నేరుగా ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి వెళ్తారు.
- Author : Praveen Aluthuru
Date : 18-10-2023 - 6:49 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana: తెలంగాణలో మూడు రోజుల పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్ర నేతలు ప్రియాంక గాంధీ , రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రియాంక, రాహుల్ నేరుగా ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి వెళ్లారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు హామీలపై హామీ ఇస్తూ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం బస్సు యాత్ర చేసి వెంకటాపూర్ మండలం రామాంజాపురంలో బహిరంగ సభలో పాల్గొంటారు . అక్కడ మహిళా డిక్లరేషన్‌ను ప్రియాంక ప్రకటించనుంది. సభకు కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు.
కాంగ్రెస్ అగ్రనేతల పర్యటన నేపథ్యంలో భద్రతా బలగాలను భారీగా మోహరించారు. రామప్ప ఆలయాన్ని వారి ఆధీనంలోకి తీసుకున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో హై అలర్ట్ ప్రకటించారు. రామప్ప వైపు వచ్చే ప్రతి వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. బస్సు యాత్ర మార్గంలో నో ఫ్లై జోన్‌ను ప్రకటించారు .
తెలంగాణలో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మరంగా కొనసాగించేందుకు సిద్ధమైంది . ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు తెలంగాణలో కాంగ్రెస్ నేతలు బస్సుయాత్ర చేయనున్నారు. 3 రోజుల్లో 8 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బస్సు యాత్ర కొనసాగనుంది.
Also Read: Telangana: బీఆర్‌ఎస్‌లో మూకుమ్మడిగా రాజీనామాలు