Khammam Rains: మంత్రి పువ్వాడపై భగ్గుమన్న ఖమ్మం వాసులు
తెలంగాణాలో భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయా రాజకీయ నాయకులు తమతమ నియోజకవర్గాల్లో పర్యటించాలని ఆదేశించారు
- Author : Praveen Aluthuru
Date : 30-07-2023 - 11:15 IST
Published By : Hashtagu Telugu Desk
Khammam Rains: తెలంగాణాలో భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయా రాజకీయ నాయకులు తమతమ నియోజకవర్గాల్లో పర్యటించాలని ఆదేశించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, సంబంధిత శాఖలు సమన్వయంతో ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశాల మేరకు వారు ప్రజల వద్దకు వెళ్తున్నారు. పరిస్థితిని పరిశీలించి నష్టాన్ని అంచనా వేస్తున్నారు. అయితే ఖమ్మంలో భారీ వరదల కారణంగా మంత్రి పువ్వాడ స్థానిక కాలనీల్లో పర్యటించారు. అయితే ఎదో కేసీఆర్ ఆదేశించారు కాబట్టి మొక్కుబడిగా పర్యటించినట్టయింది ఆయన పర్యటన. దీంతో ఖమ్మం వాసులు మంత్రిపై భగ్గుమన్నారు. వరదల వల్ల సర్వం కోల్పోయాం, కనీసం మా ఇండ్లు పరిశీలించకుండా రోడ్డు మీద నుండే వెళ్ళిపోయాడని ఆవేదన వ్యక్తం చేస్తూ, పువ్వాడపై మండిపడ్డారు. మీడియాలో అలెర్ట్ కోసం, సోషల్ మీడియా ప్రచారం కోసం, కేసీఅర్ దగ్గర హాజరు కోసం తప్ప, భాదితులపై ఏమాత్రం దయ లేదని కాంగ్రెస్ విమర్శించింది.
వరదల వల్ల సర్వం కోల్పోయాం, కనీసం మా ఇండ్లు పరిశీలించకుండా రోడ్డు మీద నుండే వెళ్ళిపోయాడని ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే మంత్రి పువ్వాడ అజయ్ పై భగ్గుమంటున్న ప్రజలు.
మీడియాలో అలెర్ట్ కోసం, సోషల్ మీడియా ప్రచారం కోసం, కేసీఅర్ దగ్గర హాజరు కోసం తప్ప, భాదితులపై ఏమాత్రం దయ లేదు… pic.twitter.com/nFa35oDGPe
— Telangana Congress (@INCTelangana) July 30, 2023
Also Read: Lahore Rains: భారీ వర్షాల కారణంగా పాకిస్థాన్ అస్తవ్యస్తం