HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Priyanaka Gandhi Comments On Bjp And Narendra Modi

Priyanka Gandhi : రాజ్యాంగాన్ని భారత ప్రజలు రచించారు.. మోదీ కాదు

తెలంగాణలో ప్రచారం పర్వం నేటితో ముగియనుంది.

  • Author : Kavya Krishna Date : 11-05-2024 - 7:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Priyanka Gandhi (1)
Priyanka Gandhi (1)

తెలంగాణలో ప్రచారం పర్వం నేటితో ముగియనుంది. అయితే.. ఈ నేపథ్యంలో నేడు వికారాబాద్‌ జిల్లాలోని తాండూరులో నిర్వహించి కాంగ్రెస్‌ జనజాతర సభలో కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ధర్మం గురించి బీజేపీ మాట్లాడి విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అధికారం తమ చెప్పుచేతల్లో ఉండాలన్నదే బీజేపీ లక్ష్యమని ఆమె అన్నారు. ప్రజల సంపదను తీసుకొని వేరే వాళ్లకు కాంగ్రెస్ ఇస్తుందని బీజేపీ అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆమె విమర్శించారు. హిందూ ధర్మంలో నేర్పించింది ధర్మ పథంలో నడవమని.. సత్యం, అహింస అన్న సిద్ధాంతాలపై గాంధీ జీ జీవితాంతం సాగి స్వాతంత్ర్యాన్ని సాధించారని ప్రియాంక గాంధీ అన్నారు. మహత్మ గాంధీ తన ఆఖరి క్షణంలో హే రామ్ అంటూ తనువు చాలించారని, దేశంలోని ప్రతి ధర్మం సత్యం తోనే నడవమని బోధిస్తోందని, హింసా మార్గంలో వెళ్లమని ఏ ధర్మం బోధించలేదని ఆమె వ్యాఖ్యానించారు. ధర్మం పేరిట అన్నదమ్ముల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని, ధర్మం పేరిట మనుషుల మధ్య విభేదాలు సృష్టించడం పాపమని ప్రియాంక గాంధీ అన్నారు.

రాజ్యాంగాన్ని భారత ప్రజలు రచించారు.. మోదీ కాదని, పూర్వీకులు రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి తమ రక్తాన్ని, చమటను ధారపోశారని ఆమె వ్యాఖ్యానించారు. 400 వందల సీట్లు ఇస్తే దేశ రాజ్యాంగాన్ని మారుస్తానని ప్రధాని మోదీ అంటున్నారని, ఈ రాజ్యాంగం దేశం లోని 140 కోట్ల మందిది.. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చనివ్వమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఎన్ని అబద్ధాలు చెప్పాల్లో అన్ని చెప్పింది.. ఇక ముందు ప్రజలు ఆ పార్టీకి సహకరించరు.. పదేళ్ల లో ఏం చేశారని మోదీ, బీజేపీ నేతలను నిలదీయండని ఆమె అన్నారు. తెలంగాణ ప్రాంతం సుభిక్షమైంది.. ఈ ప్రాంతం కోసం ఎన్నో త్యాగాలు చేశారని, స్వయం కృషితో ఐటీ ని అభివృద్ధి చేసుకున్నారని ఆమె అన్నారు. విద్వేషాన్ని పెంపొందించడం వల్ల ప్రయోజనం ఉండదన్న సంకేతాన్ని తెలంగాణ ప్రజలు ఇవ్వాలని, విద్వేషాలు పెచ్చరిల్లితే సామాన్యులకు నష్టం జరుగుతుందన్నారు ప్రియాంక గాంధీ.

We’re now on WhatsApp. Click to Join.

నల్లధనం తీసుకువస్తా, అవినీతి నిర్మూలిస్తామని చెప్పిన మోదీ ఎలక్ట్రోల్ బాండ్ లతో అసలైన అవినీతికి పాల్పడ్డారని, కోటీశ్వరులకే మోదీ హయాంలో వికాసం జరిగిందన్నారు. పదేళ్లలో ఏం చేశానో చెప్పేంత ధైర్యం మోదీ చేయలేదని ఆమె విమర్శించారు. కన్నీళ్లు పెట్టుకున్నాడు తప్ప దేశానికి ఏం చేశాడో ప్రధాని ఒక్క వేదికపైన చెప్పలేదని, కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి తప్ప తాను ఏం చేశాడో ప్రధాని చెప్పడం లేదన్నారు ప్రియాంక. కాంగ్రెస్ పథకాలకు ప్రధాని మోదీ తన ఫోటో పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారని, ప్రజలకు సంపదను పంచే విధానం కాంగ్రెస్ న్యాయ్ పత్రంలో ఉందని ఆమె వెల్లడించారు. రైతులకు కనీస మద్దతు ధర ను చట్ట పరిధిలోకి తీసుకువస్తామని, వ్యవసాయ ఆధారిత వస్తువులపై జీఎస్టీ తొలగిస్తామని, రైతులకు రుణ మాఫీ కోసం ప్రణాళిక తయారు చేస్తామని, శ్రామికుల కోసం రోజుకు కనీస వేతనం 400 వందలకు పెంచుతామని, ప్రతి కుటుంబంలో మహిళ అకౌంట్ లో యేడాదికి లక్ష రూపాయలు వేస్తామని, యువకుల కోసం ఐదు వేల కోట్ల నిధిని ఏర్పాటు చేస్తామని, డిగ్రీ పూర్తి చేసిన యువకులకు మొదటి ఉద్యోగం పక్కా అన్న కార్యక్రమాన్ని తీసుకువస్తామని ఆమె హామీ ఇచ్చారు. తెలంగాణ లో ఇచ్చిన గ్యారంటీలు మా ప్రభుత్వం అమలు చేస్తోందని ఆమె స్పష్టం చేశారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన త్రిబుల్ ఆర్ సినిమా చూశారా.. మనకు డబల్ఆర్ ఉన్నారు.. ఆర్ అంటే రేవంత్ రెడ్డి, మరో ఆర్ అంటే రాహుల్ గాంధీ.. తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం సమర్థవంతంగా  పనిచేస్తోందని ఆమె వెల్లడించారు.
Read Also : Rahul Gandhi : తనపై వైఎస్ఆర్ ప్రభావం గురించి మాట్లాడిన రాహుల్ గాంధీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • CM Revanth Reddy
  • congress
  • Lok Sabha Elections
  • Priyanka gandhi

Related News

Cm Revanth Reddy: వర్షం వస్తే నేనే రోడ్డు మీదికి వస్తా.. అధికారులపై సీఎం రేవంత్ సీరియస్

వర్షాకాలం రానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. సంబంధిత శాఖల అధికారులతో తాజాగా కీలక సమీక్ష నిర్వహించారు. వర్షాలు, ప్రకృతి విపత్తులపై ఉన్నతాధికారులతో చర్చించారు. వర్షాలు రాకముందే ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని.. వానలు పడినప్పుడు సరిగ్గా పనిచేయాలని.. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే గతంలోనే సమీక్ష నిర్వహించి.. వర్షాలు, ప్రకృతి విపత్తుల నిర్వహణప

    Latest News

    • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

    • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

    • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

    • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

    • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd