Rahul Gandhi : తనపై వైఎస్ఆర్ ప్రభావం గురించి మాట్లాడిన రాహుల్ గాంధీ
దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సారి గెలిచి అధికారంలో వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది.
- By Kavya Krishna Published Date - 06:47 PM, Sat - 11 May 24

దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సారి గెలిచి అధికారంలో వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే.. ప్రచారంలో ఇందుకు కావాల్సిన అన్ని ప్రయత్నాలనూ చేస్తోంది కాంగ్రెస్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకా గాంధీ, పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సైతం వివిధ రాష్ట్రాల్లో ప్రచారంలో పాల్గొన్నారు. వీలైనంత వరకు ప్రజలను కాంగ్రెస్‌కు మద్దుతు పలికేలా చేయాలనేదే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అయితే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత కాంగ్రెస్ ఏ రేంజ్‌లో దెబ్బతిండో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలంగాణలో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు రెండు పర్యాయాల సమయం పట్టింది. అయితే.. ఏపీలో ఇంకా కాంగ్రెస్ పరిస్థితి ప్రశ్నార్థకంగానే ఉన్నా.. ఏపీసీసీ చీఫ్‌గా వైఎస్ షర్మిల రాకతో కొంత మేర కాంగ్రెస్ బలపడిందనే చెప్పాలి. అయితే.. ఎన్నికల నేపథ్యంలోనే రాహుల్ గాంధీ ఏపీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గ్రాండ్ ఓల్డ్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో కొన్నాళ్లుగా కనిపించింది. కొన్ని నెలల క్రితం వరకు ఈ ఎన్నికలు వైసీపీ, ప్రతిపక్షాల మధ్య పోరుగా భావించారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం పెద్ద సర్ ప్రైజ్ గా కనిపించింది. చాలా కాలం తర్వాత పార్టీ వెలుగులోకి వచ్చింది. షర్మిల కాంగ్రెస్‌లో చేరి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎంపిక కావడం పెద్ద నిర్ణయం.
We’re now on WhatsApp. Click to Join.
దీంతో కాంగ్రెస్ పోరుబాట పట్టింది. కడప ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిల అవినాష్ రెడ్డితో తలపడనున్నారు. ఆమె రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా, ప్రచారం జోరుగా సాగింది. రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ ప్రచారానికి వచ్చారు. వైఎస్ షర్మిలతోపాటు రాహుల్ గాంధీ ఇడుపులపాయలో పర్యటించి వైఎస్‌ఆర్‌కు నివాళులర్పించారు. వైఎస్ఆర్ తనపై చూపిన ప్రభావం గురించి గాంధీ వారసుడు రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ చేసిన యాత్రలకు రాహుల్ గాంధీ ఘనత వహించారు. గతంలో తాను చేపట్టిన భారత్ జోడో యాత్రకు వైఎస్ఆర్ స్ఫూర్తి అని అన్నారు. ‘వైఎస్‌ఆర్ ఏపీకే కాకుండా యావత్ దేశానికి బాటను చూపించారు.
నా భారత్ జోడో యాత్రకు వైఎస్ఆర్ పాదయాత్ర స్ఫూర్తి. వైఎస్‌ఆర్ పాదయాత్రతోనే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోగలమని చెప్పారు. దేశ వ్యాప్తంగా యాత్ర చేపట్టాలని వైఎస్‌ఆర్ చెప్పారు. నాన్నలాగా నన్ను నడిపించారు’ అని రాహుల్ గాంధీ అన్నారు. వైఎస్‌ఆర్‌తో తనకు ఉన్న బంధాన్ని నొక్కిచెప్పిన రాహుల్ గాంధీ సోదరి షర్మిలకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. వైఎస్‌ఆర్ విలువలు, సిద్ధాంతాలు పార్లమెంటులో అడుగుపెట్టాలంటే షర్మిలకు ఎన్నికల్లో ఓటేయాలని, ఆమెకు ప్రజల మద్దతు ఇవ్వాలని రాహుల్ గాంధీ అన్నారు.
Read Also : Double iSmart : డబుల్ ఇస్మార్ట్ నుంచి బిగ్ అప్డేట్..!