HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >President Droupadi Murmu Visit To Hyderabad On 21st And 22nd Of November To Inaugurate Lok Manthan Bhagyanagar 2024

President Droupadi Murmu : ‘లోక్ మంథన్ – భాగ్యనగర్ 2024’.. 21, 22 తేదీల్లో హైదరాబాద్‌‌లో రాష్ట్రపతి పర్యటన

సూర్య నమస్కారం, సూర్యుడికి పూజలు, ప్రకృతి శక్తుల ఆరాధన వంటి భావనలు యజీదీ తెగలోనూ(President Draupadi Murmu) ఉన్నాయి.

  • By Pasha Published Date - 02:18 PM, Wed - 13 November 24
  • daily-hunt
President Draupadi Murmu Hyderabad Visit Lok Manthan Bhagyanagar 2024 Event

President Droupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెలలో మరోసారి హైదరాబాద్ పర్యటనకు విచ్చేయనున్నారు. ఈనెల 21, 22 తేదీల్లో ఆమె  నగరంలో పర్యటించనున్నారు. ‘లోక్ మంథన్ – భాగ్యనగర్ 2024’ పేరుతో నవంబరు 22న హైదరాబాద్‌లో జరగనున్న కార్యక్రమాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలను నేటికీ భక్తిశ్రద్ధలతో పాటిస్తున్న ప్రాచీన విదేశీ తెగల వారు కూడా పాల్గొననున్నారు. ఇరాన్‌, టర్కీ  దేశాల సరిహద్దుల్లో ఉండే కుర్దిస్తాన్ ప్రాంతంలో నివసించే ‘యజీదీ’ తెగవారిని ఈ ఈవెంట్‌కు ఆహ్వానించినట్లు తెలిసింది. ఈ ఈవెంట్‌లో యజీదీ తెగవారు తమ ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలను అద్దంపట్టే కళా ప్రదర్శనలతో అలరించనున్నారు. సూర్య నమస్కారం, సూర్యుడికి పూజలు, ప్రకృతి శక్తుల ఆరాధన వంటి భావనలు యజీదీ తెగలోనూ(President Droupadi Murmu) ఉన్నాయి. యజీదీ తెగకు సంబంధించిన ఆచారాలు చాలా ప్రాచీనమైనవని చెబుతుంటారు. యజీదీ తెగ వారిపై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు గతంలో చాలాసార్లు తీవ్రదాడులకు పాల్పడ్డారు. ఎంతోమంది యజీదీలను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టారు. ప్రాణాలు తీశారు. అయినా యజీదీ తెగవారు తమ సంస్కృతి, సంప్రదాయాలను నేటికీ పాటిస్తూ ముందుకు సాగుతున్నారు.

Also Read :New Degree Syllabus : విద్యార్థులకు జాబ్ సాధించి పెట్టేలా డిగ్రీ కొత్త సిలబస్

ఈ ఈవెంట్‌లో భాగంగా కాకతీయ, విజయనగర, కర్ణాటకకు చెందిన జనపద సంస్కృతి, సంప్రదాయాలను అద్దంపట్టే ఒక ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ ఎగ్జిబిషన్‌ను మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ప్రారంభిస్తారు. ఈ ఎగ్జిబిషన్‌లో తెలంగాణ, ఏపీ సహా దాదాపు 10 రాష్ట్రాలకు ప్రత్యేక పెవిలియన్లు ఉంటాయి. ఆయా పెవిలియన్లలో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జిబిట్లను ప్రదర్శిస్తారు. ఈ ఈవెంటులో భాగంగా దాదాపు 125 రకాల కళా రూపాలను ప్రదర్శించనున్నారు.  మళయాలం నటి, కూచిపూడి డ్యాన్సర్ రచనా నారాయణ కుట్టి ఈసందర్భంగా నృత్య ప్రదర్శన చేయనున్నారు. కశ్మీరీ శైవ తత్వం ఆధారంగా ఈ నృత్య ప్రదర్శన ఉంటుంది. తెలంగాణ కళాకారుల జుగల్‌బందీ ఈవెంట్ ఒకటి ఉంటుంది. ఆర్మేనియా కళాకారుల సంగీత ప్రదర్శన ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రముఖుల్లో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Also Read :Childrens Day 2024 : బాలల దినోత్సవాన్ని నవంబరు 14నే ఎందుకు నిర్వహిస్తారంటే..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • Droupadi Murmu
  • hyderabad
  • Lok Manthan Bhagyanagar
  • President Droupadi Murmu

Related News

Jubilee Hills

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. నోటిఫికేష‌న్ విడుద‌ల‌!

ఈ ఉప ఎన్నిక జూబ్లీహిల్స్ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ కీలకమైన స్థానాన్ని దక్కించుకోవడానికి ఇప్పటికే తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

  • Lokesh Vizag

    Vizag Development : హైదరాబాద్ కు 30 ఏళ్లు.. విశాఖకు 10 ఏళ్లు చాలు – లోకేశ్

  • HYDRA

    Hydraa : 750 కోట్ల విలువైన భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా

Latest News

  • Rayalaseema : రాయలసీమలో ఉపాధి అవకాశాలు పెరిగాయి – మోదీ

  • Silver Price : దీపావళి తర్వాత సిల్వర్ రేట్ తగ్గుతుందా?

  • AI Vizag : AIకు ఏపీ తొలి గమ్యస్థానంగా మారనుంది – మోదీ

  • Fake Votes : కేటీఆర్ చెప్పింది అంత అబద్దమే..దొంగ ఓట్లు సృష్టిచిందే బిఆర్ఎస్ పార్టీ

  • Telangana Cabinet Meeting : క్యాబినెట్ సమావేశానికి కొండా సురేఖ గైర్హాజరు

Trending News

    • Chandrababu : కర్నూలు : ”సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం

    • Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!

    • PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్

    • Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

    • Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd