HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Police Used 3rd Degree On Women Accused In Shadnagar

Police Used 3rd Degree: మ‌హిళ‌పై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించిన పోలీసులు.. న‌డ‌వ‌లేని పరిస్థితుల్లో మ‌హిళ‌..!

ప్రస్తుతం దెబ్బలు తిన్న మహిళ తీవ్ర అస్వస్థతతో ఇంట్లో వేదన అనుభవిస్తుంది.

  • Author : Gopi Date : 04-08-2024 - 11:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Police Used 3rd Degree
Police Used 3rd Degree

Police Used 3rd Degree: బంగారం దొంగతనం జరిగిందని అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు నిర్ధాక్షిణ్యంగా ఓ దళిత మహిళను మగ పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు. నిజం ఒప్పుకోవాలని తన కన్న కొడుకు ముందే తల్లి, కొడుకులను దారుణంగా (Police Used 3rd Degree) కొట్టారు. కొట్టిన దెబ్బలకు స్పృహ తప్పి మూర్చపోగా పోలీస్ స్టేషన్ ఆవరణలోని ఫిర్యాదుదారుడితో బాధితురాలి తలకు, కాళ్లకు జండ్ బామ్ వ్రాయించారు.

ఫిర్యాదుదారుడి కారులోనే బాధితులను అర్ధరాత్రి ఇంటికి హుటాహుటిన తరలించారు. ప్రస్తుతం దెబ్బలు తిన్న మహిళ తీవ్ర అస్వస్థతతో ఇంట్లో వేదన అనుభవిస్తుంది. సైబరాబాద్ పరిధిలోని షాద్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన సునీత భీమయ్య దంపతులను పోలీసులు ఓ దొంగతనం ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. పక్కింట్లో నివాసముంటున్న నాగేందర్ అనే వ్యక్తి వీరిపై గత నెల 24వ తేదీన షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ ఇంట్లో బంగారం దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి మరో నలుగురు పోలీసు సిబ్బంది రఫీ, మోహన్ లాల్, కరుణాకర్ ,అఖిల, అనే మొత్తం ఐదు మంది పోలీసులు సునీత భీమయ్య దంపతులను మొదట అదుపులోకి తీసుకున్నారు.

Also Read: Nani Saripoda Shanivaram : సరిపోదా శనివారం మేకింగ్ వీడియో.. హిట్ వైబ్ కనిపిస్తుందిగా..!

ఆ తర్వాత భర్త భీమయ్యను వదిలేసిన పోలీసులు కుమారుడు 13 ఏళ్ల జగదీష్ తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. తల్లి, కొడుకులను అదుపులోకి తీసుకొని పోలీసులు తమదైన శైలిలో ఇంటరాగేషన్ చేశారు. డిఐ రాంరెడ్డి సునీతను చిత్రహింసలకు గురి చేసినట్టు బాధితురాలు పేర్కొంది. పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చిన రాత్రి తనను బట్టలు విప్పించి కాళ్ల మధ్యన కర్రలు పెట్టి బూటు కాళ్లతో తొక్కుతూ చీర విప్పించి చెడ్డి తొడిగించి మరి కన్న కొడుకు జగదీశ్వర్ ముందే చితకబాదారు.

దొంగతనం ఒప్పుకోకపోవడంతో ఆమె కొడుకు అయిన జగదీశ్వర్ ను కూడా అరికాళ్ళపై లబ్బర్ బెల్ట్ తో కొట్టినట్టు బాధితులు పేర్కొన్నారు. కొడుతున్న దెబ్బలకు తాళలేక మూర్చపోయి స్పృహ తప్పిపోగా సునీతను ఇంటికి పంపించారు. అది కూడా ఆమెపై ఫిర్యాదు చేసిన వ్యక్తి కారులోనే ఇంటికి పంపించడం గమనార్హం.

We’re now on WhatsApp. Click to Join.

బంగారం దొరికింది

నాగేందర్ ఇంట్లో బంగారం పోయిందని ఆరోపణలు ఎదురుకుంటున్న బాధితురాలు సునీత ఇంటి ముందు బంగారం దొరికిందని, ఈ దొంగతనం చేసింది సునీతనేనని ఆరోపణలపై ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు అరాచకం సృష్టించారు. అయితే మొత్తం 26 ఆరు తులాల బంగారం, రెండు లక్షల నగదు పోయిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారాని.. అందులో నుండి ఒక తులం బంగారం, నాలుగు వేల రూపాయలు రికవరీ చేసినట్టు చెబుతున్నారు పోలీసులు.

అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశాం

జరిగిన దారుణ ఘటనపై షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డిని వివరణ కోరగా సునీత అనే మహిళపై కేసు నమోదు చేశామని ఆమెపై విచారణ కొనసాగిస్తున్నామని విచారణలో భాగంగా స్టేషన్ కు తీసుకు వచ్చామని అన్నారు. అయితే బంగారం ఆమె తీసుకుందని గ్యారెంటీ లేదని అది విచారణలో తేలుతుందన్నారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి.. పది రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు రిమాండ్ ఎందుకు చేయలేదనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. పోలీసులు కొట్టిన దెబ్బలతో బాధితురాలికి ఆరోగ్యం బాగాలేకనే రిమాండ్ చేయ్యలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాంరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి స్పందించారు. కాసేపటి క్రితం రామిరెడ్డిని సైబరాబాద్ కార్యాలయానికి అటాచ్ చేస్తున్నట్టు మీడియాకు ప్రకటించారు. వచ్చిన ఆరోపణలపై విచారణ జరుపుతున్న ఉన్నతాధికారులు షాద్‌నగర్ డీఐని సైబరాబాద్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. ఘటనపై ఏసీపీ రంగస్వామి షాద్‌నగర్‌ విచారణ జరుపుతున్నారు. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని కమీషనర్ అవినాష్ మొహంతి అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime news
  • police
  • Police Used 3rd Degree
  • Rangareddy
  • telangana

Related News

MIssing Case

Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

ఫిన్లాండ్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి 45 రోజులుగా అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. కుమారుడి ఆచూకీ కోసం తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చివరకు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హయత్‌నగర్‌కు చెందిన గుజ్జ మణిదీప్ రెడ్డి, ఫిన్లాండ్‌లోని లాహ్తిలో ఉన్న LUT యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. మే 5న తన కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడిన తర

  • Engineering counselling in Telangana begins today.

    TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

  • Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

    LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

  • Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

    Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

  • A techie who gave up the American dream... today, she is a role model for many farmers. So, who is Sanjana Reddy? What is this interesting story?

    Sanjana Reddy Inspiring Journey: అమెరికన్ కలను వదులుకున్న టెక్కీ… నేడు ఆమె ఎందరో రైతులకు ఆదర్శం.. ఇంతకీ సంజన రెడ్డి ఎవరు? ఏంటా ఇంట్రెస్టింగ్ స్టోరీ

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd