Police Used 3rd Degree: మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులు.. నడవలేని పరిస్థితుల్లో మహిళ..!
ప్రస్తుతం దెబ్బలు తిన్న మహిళ తీవ్ర అస్వస్థతతో ఇంట్లో వేదన అనుభవిస్తుంది.
- By Gopichand Published Date - 11:58 PM, Sun - 4 August 24

Police Used 3rd Degree: బంగారం దొంగతనం జరిగిందని అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు నిర్ధాక్షిణ్యంగా ఓ దళిత మహిళను మగ పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు. నిజం ఒప్పుకోవాలని తన కన్న కొడుకు ముందే తల్లి, కొడుకులను దారుణంగా (Police Used 3rd Degree) కొట్టారు. కొట్టిన దెబ్బలకు స్పృహ తప్పి మూర్చపోగా పోలీస్ స్టేషన్ ఆవరణలోని ఫిర్యాదుదారుడితో బాధితురాలి తలకు, కాళ్లకు జండ్ బామ్ వ్రాయించారు.
ఫిర్యాదుదారుడి కారులోనే బాధితులను అర్ధరాత్రి ఇంటికి హుటాహుటిన తరలించారు. ప్రస్తుతం దెబ్బలు తిన్న మహిళ తీవ్ర అస్వస్థతతో ఇంట్లో వేదన అనుభవిస్తుంది. సైబరాబాద్ పరిధిలోని షాద్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన సునీత భీమయ్య దంపతులను పోలీసులు ఓ దొంగతనం ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. పక్కింట్లో నివాసముంటున్న నాగేందర్ అనే వ్యక్తి వీరిపై గత నెల 24వ తేదీన షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ ఇంట్లో బంగారం దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి మరో నలుగురు పోలీసు సిబ్బంది రఫీ, మోహన్ లాల్, కరుణాకర్ ,అఖిల, అనే మొత్తం ఐదు మంది పోలీసులు సునీత భీమయ్య దంపతులను మొదట అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Nani Saripoda Shanivaram : సరిపోదా శనివారం మేకింగ్ వీడియో.. హిట్ వైబ్ కనిపిస్తుందిగా..!
ఆ తర్వాత భర్త భీమయ్యను వదిలేసిన పోలీసులు కుమారుడు 13 ఏళ్ల జగదీష్ తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. తల్లి, కొడుకులను అదుపులోకి తీసుకొని పోలీసులు తమదైన శైలిలో ఇంటరాగేషన్ చేశారు. డిఐ రాంరెడ్డి సునీతను చిత్రహింసలకు గురి చేసినట్టు బాధితురాలు పేర్కొంది. పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చిన రాత్రి తనను బట్టలు విప్పించి కాళ్ల మధ్యన కర్రలు పెట్టి బూటు కాళ్లతో తొక్కుతూ చీర విప్పించి చెడ్డి తొడిగించి మరి కన్న కొడుకు జగదీశ్వర్ ముందే చితకబాదారు.
దొంగతనం ఒప్పుకోకపోవడంతో ఆమె కొడుకు అయిన జగదీశ్వర్ ను కూడా అరికాళ్ళపై లబ్బర్ బెల్ట్ తో కొట్టినట్టు బాధితులు పేర్కొన్నారు. కొడుతున్న దెబ్బలకు తాళలేక మూర్చపోయి స్పృహ తప్పిపోగా సునీతను ఇంటికి పంపించారు. అది కూడా ఆమెపై ఫిర్యాదు చేసిన వ్యక్తి కారులోనే ఇంటికి పంపించడం గమనార్హం.
We’re now on WhatsApp. Click to Join.
బంగారం దొరికింది
నాగేందర్ ఇంట్లో బంగారం పోయిందని ఆరోపణలు ఎదురుకుంటున్న బాధితురాలు సునీత ఇంటి ముందు బంగారం దొరికిందని, ఈ దొంగతనం చేసింది సునీతనేనని ఆరోపణలపై ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు అరాచకం సృష్టించారు. అయితే మొత్తం 26 ఆరు తులాల బంగారం, రెండు లక్షల నగదు పోయిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారాని.. అందులో నుండి ఒక తులం బంగారం, నాలుగు వేల రూపాయలు రికవరీ చేసినట్టు చెబుతున్నారు పోలీసులు.
అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశాం
జరిగిన దారుణ ఘటనపై షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డిని వివరణ కోరగా సునీత అనే మహిళపై కేసు నమోదు చేశామని ఆమెపై విచారణ కొనసాగిస్తున్నామని విచారణలో భాగంగా స్టేషన్ కు తీసుకు వచ్చామని అన్నారు. అయితే బంగారం ఆమె తీసుకుందని గ్యారెంటీ లేదని అది విచారణలో తేలుతుందన్నారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి.. పది రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు రిమాండ్ ఎందుకు చేయలేదనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. పోలీసులు కొట్టిన దెబ్బలతో బాధితురాలికి ఆరోగ్యం బాగాలేకనే రిమాండ్ చేయ్యలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాంరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి స్పందించారు. కాసేపటి క్రితం రామిరెడ్డిని సైబరాబాద్ కార్యాలయానికి అటాచ్ చేస్తున్నట్టు మీడియాకు ప్రకటించారు. వచ్చిన ఆరోపణలపై విచారణ జరుపుతున్న ఉన్నతాధికారులు షాద్‌నగర్ డీఐని సైబరాబాద్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. ఘటనపై ఏసీపీ రంగస్వామి షాద్‌నగర్ విచారణ జరుపుతున్నారు. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని కమీషనర్ అవినాష్ మొహంతి అన్నారు.