Police Personnel Suicides : పోలీసు సిబ్బంది సూసైడ్స్ కలకలం.. ప్రధాన కారణాలు అవేనట!
ఈ తరుణంలో పోలీసులపై పని ఒత్తిడిని తగ్గించేందుకు పోలీసుశాఖలో(Police Personnel Suicides) ఇప్పుడిప్పుడే దిద్దుబాటు చర్యలు మొదలయ్యాయి.
- By Pasha Published Date - 10:50 AM, Sat - 11 January 25

Police Personnel Suicides : ఎస్సైలు కావచ్చు.. కానిస్టేబుళ్లు కావచ్చు.. ఎవరైతేనేం మనుషులే కదా !! వారు కూడా అందరిలాగే పని ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఉన్నతాధికారుల ఆదేశాలను తు.చ తప్పకుండా అమలు చేస్తూ ప్రజాసేవలో నిత్యం తరిస్తుంటారు. ఈక్రమంలో పోలీసు ఉన్నతాధికారుల వేధింపుల వల్ల కొందరు.. వ్యక్తిగత కారణాలతో ఇంకొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చేతులారా ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రజలకు కౌన్సెలింగ్ చేయాల్సిన పోలీసులే ఇలా చేస్తే.. సామాన్య జనం సంగతేంటి అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ఈ తరుణంలో పోలీసులపై పని ఒత్తిడిని తగ్గించేందుకు పోలీసుశాఖలో(Police Personnel Suicides) ఇప్పుడిప్పుడే దిద్దుబాటు చర్యలు మొదలయ్యాయి.
Also Read :Hyderabad To Vijayawada : విజయవాడ మార్గంలో వాహన రద్దీ.. ఈ దారుల్లో వెళ్తే సాఫీగా జర్నీ
ఈ కేస్ స్టడీలు చూడండి..
- కొందరు పోలీసు సిబ్బంది అవసరాలను మించి అప్పులు చేస్తున్నారు. వ్యసనాలకు అలవడుతున్నారు. వాటివల్ల శారీరకంగా, మానసికంగా కుంగిపోతున్నారు.
- ఓ యువ ఎస్సై చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఖర్చుల కోసం అవినీతిబాటలో నడిచాడు. చివరకు అవమాన భారంతో సూసైడ్ చేసుకున్నాడు.
- కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ విధుల నిర్వహణలో కొందరు సమన్వయం చేసుకోలేక ఒత్తిడికి గురవుతున్నారు. పోలీసు సిబ్బందిని వీటి నుంచి బయట పడేసేందుకు సైకాలజిస్టులతో ప్రత్యేక కౌన్సెలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
- ట్రాఫిక్ విభాగంలోని ఒక హెడ్‌కానిస్టేబుల్ తన ఉన్నతాధికారి వసూళ్ల టార్గెట్‌ను తీర్చలేక ఆస్పత్రి పాలయ్యాడు.
- సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ పరిధిలో పలువురు ఏసీపీల పనితీరు బాగా లేదంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం.
Also Read :Wildfires Vs Fish : లాస్ ఏంజెల్స్‌ను కాల్చేసిన కార్చిచ్చుకు ఈ చేపలే కారణమట !
మొత్తం మీద తెలంగాణలో పలువురు పోలీసు సిబ్బంది ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 3 కమిషనరేట్లలో వివిధ హోదాల్లో 40 వేల మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. నగరంలో నానాటికీ పెరుగుతున్న కేసుల వల్ల పోలీసులకు సెలవులు లభించటం కష్టతరంగా మారింది. గతంలో పోలీస్ పెట్రోలింగ్ సిబ్బంది 24 గంటలు విధుల్లో ఉండి మరుసటిరోజు లీవ్ తీసుకునేవారు. ఇప్పుడు దాన్ని 8 గంటల చొప్పున 3 షిప్ట్‌లుగా మార్చారు. అంటే మునుపటి కంటే కాస్త బెటర్‌గా పనిగంటలు అమలవుతున్నాయి. మహిళా కానిస్టేబుళ్లకు ప్రత్యేక బ్యారక్‌లు అందుబాటులోకి వచ్చాయి.