Work From Home: వర్షాలతో పోలీస్ శాఖ అలర్ట్, ఐటీ ఉద్యోగులకు కీలక సూచనలు!
తెలంగాణ పోలీసులు ఐటీ ఉద్యోగులకు పలు సూచనలు చేశారు.
- Author : Balu J
Date : 05-09-2023 - 3:53 IST
Published By : Hashtagu Telugu Desk
గ్రేటర్ హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు, కాలనీలు నీట మునిగి జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ ముందుగానే అప్రమత్తమైంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని వాతావరణశాఖ హెచ్చరించడంతో పోలీస్ శాఖ అలర్ట్ అయ్యింది. ఈక్రమంలో తెలంగాణ పోలీసులు ఐటీ ఉద్యోగులకు పలు సూచనలు చేశారు.
సాధ్యమైనంత వరకూ వర్క్ ఫ్రం హోం చేసుకోవాలని సూచించారు. అత్యవసర సేవల ఉద్యోగులు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర సమయాల్లో డయల్ 100కి కాల్ చేయాలని సూచించారు. ఈ మేరకు తెలంగాణ పోలీస్‌శాఖ సోషల్ మీడియాలో పలు సూచనలు చేసింది. భారీ వర్షాలతో జీహెచ్ఎంసీ కూడా అలర్ట్ అయ్యింది.
“హైదరాబాద్‌లో భారీ వర్షాలు. అవసరం అయితే తప్ప మీ ఇంటి నుండి బయటకు రాకండి. 3000 మందికి పైగా ఉన్న మా బృందాలు నగరం అంతటా నీటి ఎద్దడిని తొలగిస్తున్నాయి. GHMC-DRF సహాయం కోసం 040-21111111 లేదా 9000113667కు కాల్ చేయవచ్చు” అని GHMC కమిషనర్ తెలిపారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్‌ఎఫ్) బృందాలు నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి నిల్వలు, కూలిన చెట్లను తొలగిస్తున్నాయి.
Also Read: One Chip Challenge: వన్ చిప్ ఛాలెంజ్.. స్పైసీ చిప్స్ తిని బాలుడు మృతి!