Modi Greets KCR: కేసీఆర్ కు మోడీ ‘బర్త్ డే’ గ్రీటింగ్స్.. దీర్ఘాయుష్షు అంటూ ట్వీట్!
69వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
- By Balu J Published Date - 03:27 PM, Fri - 17 February 23

తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు అన్నీ జిల్లా కేంద్రాల్లో అభిమానులు, ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ (BRS Party) శ్రేణులు ముఖ్యమంత్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలను వినూత్న రీతిలో తెలియజేస్తున్నారు. కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఒకరోజు ముందుగానే సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించారు. రాష్ట్ర ఆర్ధిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు నేతృత్వంలో స్థానిక జయశంకర్ స్టేడియంలో కేక్ కట్ చేశారు. అనంతరం కేసీఆర్ క్రికెట్ కప్ సీజన్-3 టోర్నమెంట్‌ను అట్టహాసంగా ప్రారంభించారు. కేసీఆర్ (CM KCR) అంటే కారణజన్ముడుగా… చిరస్మరణీయుడుగా ప్రజల తల రాతలను మార్చే మహనీయుడుగా అభివర్ణించారు మంత్రి హరీష్‌రావు. కేటీఆర్, కవిత కూడా శుభాకాంక్షలు తెలియజేశారు.
మోడీ గ్రీటింగ్స్..
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (CM KCR) 69వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శుక్రవారం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌గారికి జన్మదిన శుభాకాంక్షలు అని మోదీ ట్వీట్ చేశారు. దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను. ” అంటూ ట్వీట్ చేశారు. ఇక బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపకుడు కెసిఆర్, బిజెపిని సవాలు చేసేందుకు అనేక ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తూ భారత రాష్ట్ర సమితితో జాతీయ పార్టీ (BRS) నెలకొల్పిన విషయం తెలిసిందే.
Birthday greetings to Telangana CM Shri KCR Garu. I pray for his long life and good health. @TelanganaCMO
— Narendra Modi (@narendramodi) February 17, 2023
Also Read: Group-II Applications: గ్రూప్-2 కు ఫుల్ డిమాండ్.. ఒక్కో పోస్టుకు 705 దరఖాస్తులు