Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు.
- Author : Gopichand
Date : 29-03-2024 - 8:34 IST
Published By : Hashtagu Telugu Desk
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ గట్టుమల్లుతో పాటు మరో ముగ్గురు టాస్క్ ఫోర్స్ పోలీసులను దర్యాప్తు బృందం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కొంపల్లిలోని న్యాయమూర్తి నివాసంలో రాధా కిషన్ రావును పోలీసులు నేడు ఉదయం 10 గంటలకు హాజరు పరచనున్నారు. గురువారం రాధా కిషన్ రావును పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. బేగంబజార్ లోని హవాలా వ్యాపారం చేసే వారిని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు రాధా కిషన్ రావుపై ఆరోపణలు ఉన్నాయి. IPS, IASలపై ప్రణీత్ రావు టీం నిఘా పెట్టినట్టు దర్యాప్తు బృందం గుర్తించింది.
గతంలో బీఆర్‌ఎస్ హయాంలో పలు ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌ల నుంచి ఇంటెలిజెన్స్ సమాచారాన్ని చెరిపివేశారని, అలాగే ఆరోపించిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై హైదరాబాద్ పోలీసులు గతంలో అరెస్టు చేసిన ఎస్‌ఐబీ డీఎస్పీ డి ప్రణీత్‌రావుతో సస్పెండ్‌కు గురైనట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో కేసీఆర్‌కు చెందిన బీఆర్‌ఎస్ పార్టీ హస్తం ఉన్నట్లు విచారణలో తేలింది.
నేడు కస్టడీకి భుజంగారావు, తిరుపతన్నలను అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. 5 రోజుల కస్టడీకి కోర్టు గురువారం అనుమితినిచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భుజంగారావు, తిరుపతన్నలు చంచల్‌గూడ జైలులో ఉన్నారు. నేడు ఉదయం 10 గంటలకు చంచల్ గూడ జైల్ నుండి వారిని దర్యాప్తు బృందం కస్టడీలోకి తీసుకోనుంది. వారికి ఉస్మానియాలో వైద్య పరీక్షలు అనంతరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణ చేయనున్నారు. ఐదు రోజులపాటు కస్టడీలో భుజంగరావు, తిరుపతన్నలను దర్యాప్తు బృందం విచారించనున్నారు.
We’re now on WhatsApp : Click to Join