HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Phone Tapping Case Relief To Brs Leader Harish Rao In Telangana High Court

Harish Rao : ఫోన్ ట్యాపింగ్ కేసు.. తెలంగాణ హైకోర్టులో హరీశ్‌రావుకు ఊరట

అడిగితే అరెస్టులు.. ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే బెదిరింపులు అనేలా కాంగ్రెస్ సర్కారు ధోరణి ఉందని ఆయన(Harish Rao) వ్యాఖ్యానించారు.

  • Author : Pasha Date : 05-12-2024 - 12:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Phone Tapping Case Brs Leader Harish Rao Telangana High Court

Harish Rao : ఫోన్ ట్యాపింగ్ అభియోగాలతో పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావుకు ఊరట లభించింది.  ఆయనను అరెస్టు చేయొద్దంటూ పంజాగుట్ట పోలీసులకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  హరీశ్‌రావుకు నోటీసులు ఇచ్చి విచారించుకోవచ్చని న్యాయస్థానం తెలిపింది.

Also Read :Indiramma Houses Survey App : ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో వారికే ప్రయారిటీ : సీఎం రేవంత్

ఫోన్‌ను ట్యాప్ చేయించి, తనతో పాటు తన కుటుంబ సభ్యులను హరీశ్ రావు ఇబ్బందులకు గురిచేశారని ఆరోపిస్తూ సిద్ధిపేట కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఫోన్ ట్యాపింగ్ అభియోగాలతో హరీశ్ రావుపై కేసు నమోదు చేశారు. తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ హరీశ్ రావు బుధవారం రోజు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందు వల్లే తనపై అక్రమంగా కేసులు పెట్టారని ఆయన పేర్కొన్నారు. ఇవాళ ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. హరీశ్ రావును అరెస్టు చేయొద్దని ఆర్డర్స్ ఇచ్చింది. హరీశ్‌రావుపై ఫిర్యాదు చేసిన చక్రధర్‌గౌడ్‌కు నోటీసులు  జారీ చేసింది. పోలీసులు అరెస్టు చేయకుండా తదుపరి దర్యాప్తు చేపట్టొచ్చని హైకోర్టు తెలిపింది. దర్యాప్తునకు సహకరించాలని హరీశ్‌రావుకు సూచించింది.

Also Read :Prime Minister Ousted : ‘అవిశ్వాసం’తో ప్రధాని ఔట్.. ఏకమై ఓడించిన అధికార, విపక్షాలు

అడిగితే అరెస్టులు.. ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే బెదిరింపులా ? : హరీశ్ రావు

తెలంగాణ ప్రభుత్వంపై హరీశ్ రావు ధ్వజమెత్తారు. అడిగితే అరెస్టులు.. ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే బెదిరింపులు అనేలా కాంగ్రెస్ సర్కారు ధోరణి ఉందని ఆయన(Harish Rao) వ్యాఖ్యానించారు. ‘‘ప్రజాస్వామిక  పాలన అని డబ్బా కొడుతూ రాక్షస పాలన చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పిట్ట బెదిరింపులకు, అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు’’ అని హరీశ్ తేల్చి చెప్పారు. తెలంగాణ సమాజమే రేవంత్‌ సర్కారుకు తగిన గుణపాఠం చెబుతుందన్నారు. ‘‘ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి‌‌పై ఉల్టా కేసు బనాయించారు’’  అని హరీశ్ రావు ఫైర్ అయ్యారు.ఇది ఇందిరమ్మ రాజ్యమా…? ఎమర్జెన్సీ పాలనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • BRS leader
  • harish rao
  • Phone Tapping Case
  • telangana
  • Telangana High Court

Related News

MIssing Case

Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

ఫిన్లాండ్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి 45 రోజులుగా అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. కుమారుడి ఆచూకీ కోసం తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చివరకు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హయత్‌నగర్‌కు చెందిన గుజ్జ మణిదీప్ రెడ్డి, ఫిన్లాండ్‌లోని లాహ్తిలో ఉన్న LUT యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. మే 5న తన కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడిన తర

  • Engineering counselling in Telangana begins today.

    TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

  • Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

    LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

  • Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

    Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

  • A techie who gave up the American dream... today, she is a role model for many farmers. So, who is Sanjana Reddy? What is this interesting story?

    Sanjana Reddy Inspiring Journey: అమెరికన్ కలను వదులుకున్న టెక్కీ… నేడు ఆమె ఎందరో రైతులకు ఆదర్శం.. ఇంతకీ సంజన రెడ్డి ఎవరు? ఏంటా ఇంట్రెస్టింగ్ స్టోరీ

Latest News

  • Gold Price: పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.?

  • Baba Ramdev: చంద్రబాబుపై బాబా రాందేవ్ ప్రశంసల వర్షం

  • Goat Milk: మేకపాలు ఎప్పుడూ తాగలేదా? ఈ విషయం తెలిస్తే వెంటనే తాగడం మొదలుపెడతారు!

  • Allu Arjun: కోర్టుకు రావాలంటూ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

  • Skin Glow : స్కిన్ గ్లో కోసం అదిరిపోయే న్యూట్రియెంట్స్

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd