Prime Minister Ousted : ‘అవిశ్వాసం’తో ప్రధాని ఔట్.. ఏకమై ఓడించిన అధికార, విపక్షాలు
ఐదు నెలల క్రితమే (గత జులైలోనే) అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ దేశ నూతన ప్రధానిగా(Prime Minister Ousted) బార్నియర్‌ను నియమించారు.
- By Pasha Published Date - 11:51 AM, Thu - 5 December 24

Prime Minister Ousted : ఫ్రాన్స్ ప్రధానమంత్రి మిచెల్ బార్నియర్‌కు షాక్ తగిలింది. ఆయన తన పదవిని కోల్పోయారు. ఫ్రాన్స్ చట్టసభలోని మితవాద, అతివాద సభ్యులు ఏకమైపోయి.. అవిశ్వాస తీర్మానంలో మిచెల్ బార్నియర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఫ్రాన్స్ అసెంబ్లీలో 577 ఓట్లు ఉన్నాయి. ప్రధానమంత్రికి వ్యతిరేకంగా 331 ఓట్లు పోల్ అయ్యాయి. మితవాద సభ్యులు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి మారైన్ లె పెన్ నేతృత్వంలోని ఫార్ రైట్ నేషనల్ ర్యాలీ పార్టీ కూడా మద్దతును ప్రకటించింది. దీంతో ప్రధానికి వ్యతిరేకంగా భారీగా ఓట్లు పోలయ్యాయి. పదవిని కోల్పోయిన బార్నియర్..ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌ను కలిసి తన రాజీనామా సమర్పించనున్నారు.
Also Read :Bitcoin Record Price : రూ.84 లక్షలకు చేరిన బిట్‌కాయిన్ ధర.. త్వరలో రూ.కోటికి ?
ఐదు నెలల క్రితమే (గత జులైలోనే) అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ దేశ నూతన ప్రధానిగా(Prime Minister Ousted) బార్నియర్‌ను నియమించారు. ఇంతలోనే ఆయనకు వ్యతిరేకంగా అధికార, విపక్షాలు ఏకమైపోయాయి.ఈ పరిణామంతో పదవిని కోల్పోయి.. ప్రపంచంలో అత్యంత తక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా బార్నియర్ నిలిచారు. గతంలో చివరిసారిగా 1962 సంవత్సరంలో ఇదే విధంగా అవిశ్వాస తీర్మానంతో ఫ్రాన్స్‌లో ప్రధానమంత్రి పదవిని కోల్పోయారు. మళ్లీ ఇప్పుడు బార్నియర్‌కు అలాంటి పొలిటికల్ షాక్ తగిలింది.
Also Read :Andhra Odisha Border : ‘ఆంధ్రా-ఒడిశా బార్డర్’లో గుప్పుమంటున్న గంజాయి.. సంచలన నివేదిక
బార్నియర్ కంటే ముందు 34 ఏళ్ల గాబ్రియేల్ అట్టల్ ఫ్రాన్స్ ప్రధానిగా వ్యవహరించారు. అయితే ఆయన జులైలో పదవి నుంచి తప్పుకున్నారు. ఇక తదుపరి ప్రధాని ఎవరు అనే దానిపై ఫ్రాన్స్‌లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మక్రాన్.. ఈ ఏడాదిలో మూడోసారి ప్రధానమంత్రి పోస్టు కోసం నాయకుడిని ఎంపిక చేయబోతున్నారు. ఈసారి ఆయన ఎవరికి ఛాన్స్ ఇస్తారు ? అనే దానిపై అంతటా ఆసక్తి నెలకొంది. ఇక అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ 2027 సంవత్సరం వరకు ఫ్రాన్స్ అధ్యక్ష పదవిలో కంటిన్యూ అవుతారు.