Phone Tapping Case: టాస్క్ ఫోర్స్ వాహనాల్లో అక్రమ కార్యకలాపాలు
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజురోజుకు మరిన్ని విషయాలు వెల్లడవుతున్నాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో సమాచార ధ్వంసంపై దర్యాప్తు లోతుగా సాగుతున్న కొద్దీ మలుపులు తిరుగుతోంది.
- By Praveen Aluthuru Published Date - 03:12 PM, Sat - 30 March 24

Phone Tapping Case: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజురోజుకు మరిన్ని విషయాలు వెల్లడవుతున్నాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో సమాచార ధ్వంసంపై దర్యాప్తు లోతుగా సాగుతున్న కొద్దీ మలుపులు తిరుగుతోంది. తాజాగా టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్‌డీ రాధాకిషన్‌రావును అదుపులోకి తీసుకుని విచారించగా.. షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దీనికి సంబంధించి విశ్వసనీయ సమాచారం మేరకు గత ప్రభుత్వ హయాంలో టాస్క్‌ఫోర్స్‌ను తన ఆధీనంలో ఉంచుకున్న రాధాకిషన్‌రావు .. సిబ్బందిని అక్రమ కార్యకలాపాలకు ఉపయోగించుకున్నారు . కేసుల దర్యాప్తుకే పరిమితం కాకుండా ఓ ప్రధాన పార్టీకి లబ్ధి చేకూరేలా వ్యవహరించారు. ప్రత్యేకించి గత నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో అతను చెప్పిన పార్టీకి ఆర్థిక వనరులను అందించడానికి తన బృందాన్ని మోహరించాడు.
ఈ క్రమంలో టాస్క్ ఫోర్స్ వాహనాల్లో ఏకకాలంలో డబ్బు తరలింపు చేపట్టారు. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాల్లో ఆయా పార్టీల అభ్యర్థులకు డబ్బులు పంపడంలో రాధాకిషన్ రావు బృందం కీలకపాత్ర పోషించింది. పోలీసు వాహనం అని ఎవరికీ అనుమానం రాకూడదనే ఉద్దేశ్యంతో ఈ తతంగాన్ని నడిపించారు.
We’re now on WhatsApp : Click to Join
ఈ వ్యవహారంలో ప్రస్తుతం టాస్క్‌ఫోర్స్ పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నందున త్వరలో మరికొంత మందిని అరెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ ఇమిడి ఉండడంతో ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ను చేర్చనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు సాక్ష్యాధారాలు ధ్వంసం చేసే సెక్షన్లు మాత్రమే ఉండడంతో పోలీసులు ఈ దిశగా ఆలోచిస్తున్నారు.
Also Read: Rat Glue Traps : ఎలుకలు పట్టే ప్యాడ్లు ఈ-కామర్స్ సైట్ల నుంచి ఔట్.. ఎందుకు ?