Telangana
-
హైదరాబాద్లో ప్రారంభానికి సిద్దమవుతున్న అతి పెద్ద స్టీల్ బ్రిడ్జి
హైదరాబాద్లో రూ.4,263 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్-2 నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. ప్యారడైజ్ నుంచి శామీర్పేట వరకు 18.15 KM ప్రాజెక్టులో 11.52 KM స్టీల్ బ్రిడ్జి, హకీంపేట వద్ద 6 KM అండర్ గ్రౌండ్ టన్నెల్ నిర్మాణం చేపట్టనున్నారు
Date : 06-01-2026 - 9:35 IST -
AI Jobs : AIలో 83% విద్యార్థులకు ఉద్యోగాలు
IIT హైదరాబాద్లో 62.42% మందికి ఉద్యోగాలు వచ్చినట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ BS మూర్తి తెలిపారు. ఈ సారి మొత్తం 487 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 304 మందికి ఉద్యోగాలు లభించాయని పేర్కొన్నారు
Date : 06-01-2026 - 8:30 IST -
ఈ నెల 18న మేడారంకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం వెళ్లనుండగా, జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న మహా జాతరకు అన్ని శాఖలు సమన్వయంతో పనులు నిర్వహిస్తున్నాయి.
Date : 06-01-2026 - 6:00 IST -
సినిమా చూసేందుకు ప్రసాద్ ల్యాబ్స్ కు వెళ్లిన రేవంత్ & టీం , ఇంతకీ ఏ సినిమానో తెలుసా ?
తెలంగాణ రాజకీయాల్లో నేడు ఒక ఆసక్తికరమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలతో కలిసి సామూహికంగా సినిమా వీక్షణకు వెళ్లారు.
Date : 05-01-2026 - 8:49 IST -
తెలంగాణ మహిళలకు గుడ్‌న్యూస్ తెలిపిన మంత్రి సీతక్క
ఇకపై కేవలం మధ్యవయస్కులకే పరిమితం కాకుండా, 15 ఏళ్లు దాటిన బాలికల నుంచి వృద్ధులు, దివ్యాంగుల వరకు అందరికీ ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది
Date : 05-01-2026 - 2:00 IST -
శాసన మండలిలో కన్నీరు పెట్టిన కవిత
తన పదవికి రాజీనామా చేస్తూ, సభలోనే కన్నీరు మున్నీరు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని మండలి ఛైర్మన్‌ను కోరుతూనే, సొంత పార్టీ అయిన బీఆర్ఎస్ (BRS)పై ఆమె నిప్పులు చెరిగారు
Date : 05-01-2026 - 1:25 IST -
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ కీలక సూచనలు..
Hyderabad Police Commissioner V.C. Sajjanar సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేవారికి కీలక సూచనలు చేశారు హైదరాబాద్ సీపీ సజ్జనార్. తమ ఇళ్ల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రయాణానికి ముందు స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. తద్వారా పెట్రోలింగ్‌లో భాగంగా పోలీసు సిబ్బంది ఇళ్లపై నిఘా ఉంచుతారని తెలిపారు. అంతేకాకుండా నగదు, బంగారం వంటి విలువైన వస్తువులను బ్యాంకు లాకర్ల
Date : 05-01-2026 - 1:16 IST -
ప్రభుత్వానికి సవాల్ విసిరి తోకముడిచిన బిఆర్ఎస్
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (PRLIS) డిజైన్ మార్పు, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ తొలుత ప్రభుత్వంపై ధ్వజమెత్తింది. అసెంబ్లీలో చర్చకు తాము సిద్ధమంటూ సవాలు విసిరినప్పటికీ, తీరా సమావేశాలు ప్రారంభమయ్యాక
Date : 05-01-2026 - 1:13 IST -
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి (NH-65) పై భారీగా ట్రాఫిక్ జామ్
Hyderabad Vijayawada Highway హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (NH-65) పై ప్రయాణం ఇప్పుడు నరకప్రాయంగా మారింది. హయత్‌నగర్, భాగ్యలత, పంత్ కాలనీ ప్రాంతాల్లో జరుగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా రహదారి ఇరుకుగా మారి.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతోంది. భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు కదలలేక గంటల తరబడి నిలిచిపోవడంతో ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అత్యవసర స్థిత
Date : 05-01-2026 - 1:00 IST -
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ సుదీర్ఘ ప్రసంగం
తెలంగాణ హక్కులను కాపాడటమే తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యమని రేవంత్ సర్కార్ అసెంబ్లీ సాక్షిగా చాటిచెప్పింది. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా, దాదాపు 5 గంటల పాటు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ వివరణ ఇచ్చారు
Date : 05-01-2026 - 12:58 IST -
తెలంగాణ మంత్రి సీతక్కకు కీలక బాధ్యతలు
గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు ఉపాధి కల్పించి, వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే లక్ష్యంతో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది
Date : 05-01-2026 - 11:57 IST -
ఎట్టకేలకు ఆసరా పింఛన్ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు
తెలంగాణలో దాదాపు 44 లక్షల మందికి పైగా ఆసరా పింఛన్లను పొందుతున్నారు. ఇందులో వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, ఫైలేరియా బాధితులు ఉన్నారు
Date : 05-01-2026 - 11:12 IST -
రాజకీయ లబ్ధి కోసమే జల వివాదం
ఇది కేవలం తెలంగాణలో రాజకీయ లబ్ధి కోసం ఆడుతున్న డ్రామాగా ఏపీ ప్రజలు భావిస్తున్నారు. నిజానికి, హంద్రీనీవా వంటి కీలక ప్రాజెక్టులను రికార్డు స్థాయిలో పూర్తి చేసిన ఘనత చంద్రబాబుదేనని, పుంగనూరు, మడకశిర బ్రాంచ్ కెనాల్స్ ద్వారా చిట్టచివరి చెరువులకు కృష్ణమ్మ నీటిని చేర్చిన చరిత్ర ఆయనదని
Date : 05-01-2026 - 8:02 IST -
పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో పోరాటానికి తెలంగాణ సిద్ధం!
గోదావరి బేసిన్ నుంచి ఇతర బేసిన్లకు నీటిని తరలించేటప్పుడు ఆ పరివాహక ప్రాంతంలోని రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ఉందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది.
Date : 04-01-2026 - 8:42 IST -
హిల్ట్ పాలసీపై రేపు అసెంబ్లీలో చర్చ
BRS సవాల్తో నిన్న అసెంబ్లీలో కృష్ణా జలాలపై చర్చించిన ప్రభుత్వం మరో కీలక అంశంపై డిబేటు సిద్ధమైంది. హిల్ట్ పాలసీపై రేపు సభలో చర్చించాలని నిర్ణయించింది
Date : 04-01-2026 - 6:33 IST -
సభలో అబద్ధాలు చెప్పిన సీఎం రేవంత్ రాజీనామా చేయాల్సిందే – హరీష్ రావు డిమాండ్
తెలంగాణ ఏర్పడ్డాక 42 రోజుల్లోనే కృష్ణాలో 69% నీళ్ల కోసం కేంద్రానికి KCR లేఖ రాశారని హరీశ్ రావు తెలిపారు. 'కాంగ్రెస్, TDP ద్రోహం వల్లే కృష్ణాలో 299 TMCలు వచ్చాయి. కానీ గోదావరిలో 933 TMCలకు మేం అనుమతులు సాధించాం
Date : 04-01-2026 - 2:45 IST -
హరీశ్ రావు గుంట నక్క అంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన కవిత
హరీశ్ రావును MLC కవిత 'గుంటనక్క'గా పేర్కొంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'హరీశ్ రావును CM వ్యక్తిగతంగా విమర్శిస్తే అసెంబ్లీని బాయ్్కట్ చేస్తారా? కేసీఆర్ను తిట్టినప్పుడు ఎందుకు బహిష్కరించలేదు?
Date : 04-01-2026 - 2:19 IST -
తెలంగాణ లో ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్?
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 11న విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. తర్వాత రెండు వారాల్లో 125 మున్సిపాలిటీలకు ఎలక్షన్స్ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం
Date : 04-01-2026 - 10:24 IST -
స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత సరైనదేనా?
స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేస్తూ చేసిన పంచాయతీ రాజ్ చట్ట సవరణకు నిన్న అసెంబ్లీ ఆమోదం తెలిపింది. భవిష్యత్తులో అవసరమైతే ఈ నిబంధనను మళ్లీ మార్చుకుందామని మంత్రి సీతక్క పేర్కొన్నారు
Date : 04-01-2026 - 9:58 IST -
అసెంబ్లీ లో భావోద్వేగానికి గురైన సీఎం రేవంత్ రెడ్డి
అసెంబ్లీలో సీఎం రేవంత్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యా రు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపితేనే చర్చలకు వస్తామని చంద్రబాబుకు సూటిగా చెప్పినట్లు వెల్లడించారు. తన ఒత్తిడితోనే ఆ ప్రాజెక్టు ఆగిపోయిందని గుర్తుచేశారు.
Date : 04-01-2026 - 9:30 IST