Kaushik Reddy : పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలఫై పాడి కౌశిక్ కీలక వ్యాఖ్యలు
దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు సిగ్గు, శరం, రోషం ఉండి.. అన్నం తింటుంటే రాజీనామా చేయాలన్నారు
- Author : Sudheer
Date : 11-04-2024 - 4:45 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ (BRS) పార్టీ తరుపున గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు..రీసెంట్ గా కాంగ్రెస్ (Congress) లో చేరిన సంగతి తెలిసిందే. వీరిపై హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) కీలక వ్యాఖ్యలు చేసారు. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మగాళ్లెతే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు సిగ్గు, శరం, రోషం ఉండి.. అన్నం తింటుంటే రాజీనామా చేయాలన్నారు. పార్టీ మారిన దానంపై తాము ఫిర్యాదు చేసి నెల రోజులు అవుతున్నా.. ఇప్పటి వరకూ స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని కౌశిక్ చెప్పుకొచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు డిస్ క్వాలి ఫై అవ్వక తప్పదన్నారు. తాము అసెంబ్లీకి వెళ్లి పిటిషన్ ఇద్దామంటే సెక్రెటరీ బాత్ రూంలో దాక్కున్నారని ఆరోపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను వదిలి పెట్టబోమన్నారు. వారి ఇళ్ల ముందు చావు డప్పు కొడతామని హెచ్చరించారు. ప్రస్తుతం కౌశిక్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఇప్పటికే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు..తన ఫై బిఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై వార్నింగ్ ఇవ్వడం జరిగింది. రాజకీయ అనుభవం లేని ఎమ్మెల్సీ తాతా మధుకు నన్ను విమర్శించే స్థాయిలేదని, ఆయనకు దమ్ముంటే ఎమ్మెల్సీ నిధులతో నియోజవర్గాన్ని అభివృద్ధి చేయాలని సవాల్ విసిరారు. భద్రాచలం అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరానని స్పష్టం చేశారు.
Read Also : Sajjala Ramakrishna Reddy : సజ్జల సేవలను ఎన్నికల సంఘం రద్దు చేస్తుందా..?