Lok Polls : ఈటెల నుండి రేవంత్ కోట్ల రూపాయిలు తీసుకున్నాడు – పాడి కౌశిక్ రెడ్డి
హుజురాబాద్ నియోజకవర్గంలో చెల్లని రూపాయి.. మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో ఎలా చెల్లుతుందనేది ఆలోచించండి
- Author : Sudheer
Date : 10-04-2024 - 9:46 IST
Published By : Hashtagu Telugu Desk
మల్కాజ్ గిరి (Malkajgiri) బిజెపి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ (Etela Rajender) ఫై..హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) సంచలన ఆరోపణలు చేసాడు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్‌ను గెలిపించేందుకు ఆయన వద్ద రేవంత్ రెడ్డి రూ. 25 కోట్లు తీసుకున్నాడని కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధువారం మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న పాడి కౌశిక్ రెడ్డి ..ఈటెల ఫై కీలక వ్యాఖ్యలు చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
హుజురాబాద్ నియోజకవర్గంలో చెల్లని రూపాయి.. మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో ఎలా చెల్లుతుందనేది ఆలోచించండి. 20 ఏళ్ళు హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉండి ఇలాంటి అభివృద్ధి చేయలేదు. హుజురాబాద్ ప్రజలను మోసం చేసిండు.. గజ్వేల్ ప్రజలను మోసం చేసిండు. అన్నం పెట్టిన కేసీఆర్‌ను మోసం చేసిండు. ఈరోజు మల్కాజ్‌గిరిలో మిమ్మల్ని మోసం చేయడానికి వస్తుండు తస్మాత్ జాగ్రత్త అని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. తాను సంపాదించుకున్న అక్రమ సొమ్మును కాపాడుకునేందుకు బీజేపీ అభ్యర్థిగా ఈటెల మల్కాజ్‌గిరిలో పోటీ చేస్తున్నాడు.. దయచేసి ఈ విషయాన్ని మరిచపోవద్దు అని కౌశిక్ రెడ్డి ఓటర్లకు సూచించారు. ఇక రేవంత్ రెడ్డితో ఏం కాదు.. ఆయన అమ్ముడుపోయే వ్యక్తి. ఎంపీ గా ఐదేళ్లలో ఏనాడైనా మల్కాజ్ గిరి లో ముఖం చూపించాడా..? ఒకసారి ఆలోచించండి అని ప్రశ్నించారు. జేపీతోని కుమ్మక్కై డమ్మీ అభ్యర్థి సునీతను నిలబెట్టి ఈటలను గెలిపించేందుకు రేవంత్ ప్లాన్ చేశారు. సేమ్ హుజురాబాద్ బై ఎలక్షన్స్‌లో ఏం చేసిండో.. మల్కాజ్‌గిరిలో అదే చేయబోతుండు. తస్మాత్ జాగ్రత్త.. అన్నాడు కౌశిక్.
Read Also : EC Notices To Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు ఈసీ నోటీసులు