Onion Price Hike : హైదరాబాద్‌లో ఆకాశనంటుతున్న ఉల్లి ధరలు
హైదరాబాద్ నగరంలో ఉల్లిపాయ ధరలు ఆకాశనంటుతున్నాయి. ఉల్లి కొనాలంటూ కన్నీళ్లు వస్తున్నాయంటూ వినియోగదారులు
- By Prasad Published Date - 08:27 AM, Mon - 30 October 23

హైదరాబాద్ నగరంలో ఉల్లిపాయ ధరలు ఆకాశనంటుతున్నాయి. ఉల్లి కొనాలంటూ కన్నీళ్లు వస్తున్నాయంటూ వినియోగదారులు వాపోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో ఉల్లి ధర దాదాపుగా 80 రూపాయల వరకు ఉంది. ఈ ధర రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముంటుందని వ్యాపారులు అంటున్నారు. అస్థిర వాతావరణ పరిస్థితుల కారణంగా సరఫరా లేకపోవడం ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తుంది. కేవలం రెండు వారాల క్రితం కిలోకు రూ. 25 నుండి రూ. 30 మధ్య ధర ఉండగా.. ఇప్పుడు ఆ ధర రూ.80కి పెరిగింది. ఉల్లి మార్కెట్‌లలో నాణ్యత చాలా తక్కువగా ఉన్నప్పటికీ.. ధరలు మాత్రం విపరీతంగా పెరగుతున్నాయి. BlinkitZepto, వంటి ఆన్‌లైన్ కిరాణా డెలివరీ యాప్‌లు ఉల్లిపాయల ధర దాదాపు రూ. 70, ఉండగా.. గత వారం రూ. 56 గా ఉంది. ఈ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ఎక్కువ భాగం ఆదివారం నాడు ఉల్లిపాయలు స్టాక్ లేవని చూపించాయి. కొన్ని నెలల క్రితం జూలైలో హైదరాబాద్‌లో టమాటా ధరలు అమాంతం పెరిగిపోయాయి. దాదాపు కిలో టమాట రూ. 200 వరకు విక్రయించారు. ఇప్పుడు ఉల్లిధర పెరగడంతో సామాన్యులు లబోదిబోమంటున్నారు.
Also Read: Train Accident : రైలు ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం