HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Officials Sent Back The Candidate Who Came To Make The Nomination

Lok Sabha Polls : నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థిని వెనక్కు పంపిన అధికారులు

నామినేషన్ ప్రక్రియ ముగిసే సమయంలో పెద్దపల్లి జిల్లాలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది

  • Author : Sudheer Date : 25-04-2024 - 9:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Peddapally
Peddapally

తెలుగు రాష్ట్రాల్లో ఈరోజుతో నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ నెల 18న నోటిఫికేషన్ వెలువడగా, అదే రోజు నుంచి నామినేషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల పర్వానికి ఫుల్ స్టాప్ పడింది. ఏపీలో 25 లోక్ సభ స్థానాలకు 731, 175 అసెంబ్లీ స్థానాలకు 4,210 నామినేషన్లు దాఖలు కాగా.. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు 600కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు వాటిని పరిశీలిస్తారు. ఈనెల 29 వరకు ఉపసంహరణ గడువు ఉండగా.. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న కౌంటింగ్ నిర్వహిస్తారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉండగా నామినేషన్ ప్రక్రియ ముగిసే సమయంలో పెద్దపల్లి జిల్లాలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. దళిత బహుజన పార్టీ అభ్యర్థి మాతంగి హనుమయ్య.. నిమిషం ఆలస్యంగా ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే అధికారులు గేట్లు మూసేశారు. దీంతో లోపలికి పంపించాలని బయట ఉన్న అధికారిని హనుమయ్య బతిమిలాడారు. కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించగా ఆయన వారించారు. నిబంధనల ప్రకారం నామినేషన్ కు అవకాశం లేదని తేల్చి చెప్పారు.

Read Also : Virat Kohli: దుమ్మురేపిన కింగ్ కోహ్లీ.. ఐపీఎల్ లో చారిత్రక రికార్డు,  తొలి ఆటగాడిగా గుర్తింపు!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Lok Sabha Elections
  • peddapally lok sabha candidate
  • telangana

Related News

Meeseva

Mee-Seva Charges Hike : సామాన్యులపై పెను భారం వేసిన తెలంగాణ ప్రభుత్వం

మీ సేవ నిర్వాహకుల దీర్ఘకాలిక డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, సర్వీస్ ఛార్జీలను ఏకంగా 50 శాతం మేర పెంచింది. పెరిగిన ఈ కొత్త ధరలు ఏప్రిల్ 1, బుధవారం నుండి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి

  • Sangareddy Malabar

    Malabar Gold & Diamonds Showroom : గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సంగారెడ్డిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ షోరూమ్‌ ప్రారంభం

  • Omkareshwara Temple

    Revanth Reddy: రూ.700 కోట్లతో ఓంకారేశ్వర ఆలయం..శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి..

  • Telangana Speaker Gaddam Prasad

    Telangana Sports: తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు

Latest News

  • ఈది రాజధాని రైతుల విజయం.రేణుకా చౌదరి

  • Cm Chandrababu Naidu: తల్లికి వందనంపై కీలక ప్రకటన

  • Kerala Assembly Election 2026 : యూడీఎఫ్ మేనిఫెస్టో విడుదల చేసిన తెలంగాణ సీఎం రేవంత్

  • AP Elections : 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల పట్ల సంచలన ఆరోపణలు చేసిన పరకాల

  • ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రూ.7,059 కోట్ల బకాయిల విడుదల

Trending News

    • Condom Shortage: భారీగా పెరగనున్న కండోమ్ ధరలు

    • అల‌ర్ట్‌.. నేటి నుంచి కీల‌క మార్పులు!

    • శ్రేయస్ అయ్యర్‌పై బీసీసీఐ జరిమానా.. గ‌తేడాది కూడా ఇదే త‌ప్పు!

    • Pemmasani Chandrasekhar: 29 వేల మంది రైతులకు జరిగిన అన్యాయం ఇది.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

    • Capital Amaravati: ఏపీకి గుడ్ న్యూస్.. లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం.

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd