HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Narendra Modi Speech At Sangareddy

Narendra Modi : తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది

  • Author : Kavya Krishna Date : 05-03-2024 - 12:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Modi (1)
Modi (1)

సంగారెడ్డి జిల్లా పటాన్‌ చెరులోని పటేల్‌ గూడకు ప్రధాని మోదీ (Narendra Modi) చేరుకున్నారు. రూ.9021 కోట్లతో చేపట్టే వివిధ పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఘట్కేసర్-లింగంపల్లి MMTS, మెదక్-ఎల్లారెడ్డి మధ్య 2 లైన్ల హైవే, సంగారెడ్డి X రోడ్స్ నుంచి మదీనాగూడ వరకు 6 లైన్ల విస్తరణకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిరంతరం కృషి చేస్తోందని, కట్టుబడి ఉందని ప్రధాని మోదీ వెల్లడించారు. నిన్న ఆదిలాబాద్ నుంచి రూ.56 వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించామన్నారు ప్రధాని మోదీ. ఇవాళ సంగారెడ్డి నుంచి రూ.9వేల కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టామని ఆయన తెలిపారు. రాష్ట్రాల అభివృద్ధే దేశ అభివృద్ధి అని నమ్ముతామని, దేశంలోనే తొలి సివిల్ ఏవియేషన్ రీసర్చ్ కేంద్రం బేగంపేటలో ఏర్పాటు చేశాం అని ప్రధాని మోదీ తెలిపారు. హైదరాబాద్ బేగంపేటలో ఏర్పాటు చేసే సివిల్ ఏవియేషన్ రీసర్చ్ సెంటర్ ద్వారా తెలంగాణకు గుర్తింపు వస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇది ఏవియేషన్ స్టార్టప్లు, నైపుణ్య శిక్షణకు వేదికగా నిలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. పదేళ్లలో దేశంలో ఎయిర్‌ పోర్టుల సంఖ్య రెట్టింపైందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్త రైలు మార్గాలు, విద్యుదీకరణ పనులు చేపట్టామని, పెట్రోలియం ఉత్పత్తుల రవాణాకు పారదీప్ పైపైన్ పనులు చేపట్టాం అని మోదీ పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అయితే.. తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. రాజ్‌భవన్‌ నుంచి ఉజ్జయిని మహాంకాళీ అమ్మవారి దేవాలయానికి చేరుకున్న మోదీకి అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోదీ పర్యటన నేపథ్యంలో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం అక్కడి నుంచి బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని బయలుదేరి వెళ్లారు. బేగంపేట్ నుంచి హెలికాఫ్టర్‌లో సంగారెడ్డికి చేరుకున్న ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.
Read Also : TDP-JSP : నిడదవోకు లువెళ్తున్న కందుల దుర్గేష్, గోరంట్లకు లైన్ క్లియర్?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • breaking news
  • Latest News
  • narendra modi
  • telugu news

Related News

Mamata Banerjee

Mamata Banerjee: నా నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

Trinamool Congress పశ్చిమ బెంగాల్‌కు హాని తలపెట్టే ప్రయత్నాలను బీజేపీ కొనసాగిస్తే, ఆ పార్టీ కేంద్రంలో అధికారం కోల్పోవడం ఖాయమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు. రాణిగంజ్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా నాలుగోసారి గెలవడమే తమ పార్టీ లక్ష్యమని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో విజయం స

  • Markapuram Road accident pm modi

    Pm Modi: మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

  • Andhra Pradesh Govt Set To Increase Assembly And Lok Sabha Seats

    Andhra Pradesh Assembly And Lok Sabha Seats: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల పెంపు..?

  • Nandamuri Balakrishna garu honoured with the Lifetime Achievement Award at International Film Festival Delhi

    Balakrishna: బాలకృష్ణకు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

  • Modi On Gst

    Modi : ప్రపంచంలోనే నెం 1 లీడర్ మోడీనే.. లేటెస్ట్ సర్వే చెపుతుంది ఇదే !!

Latest News

  • Crime News: స్కూల్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి..

  • Spam Calls : స్పామ్ కాల్సు తో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా చెయ్యండి..మళ్లీ అలాంటి కాల్స్ ఉండవు !!

  • Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..

  • Peddi : ‘పెద్ది’ చిత్ర యూనిట్ కు క్షమాపణలు చెప్పిన మెగా ప్రొడ్యూసర్

  • New Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్..

Trending News

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd