Nagarjuna Sagar Tour : రూ.800 మాత్రమే.. నాగార్జున సాగర్‌కు స్పెషల్ టూర్ ప్యాకేజీ
ప్రతి శని, ఆదివారాల్లో ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్ పర్యాటక భవన్ నుంచి నాగార్జున సాగర్‌కు బస్సు బయలుదేరుతుంది.
- By Pasha Published Date - 10:19 AM, Sun - 1 September 24

Nagarjuna Sagar Tour : నాగార్జున సాగర్.. తెలంగాణలో అట్రాక్టివ్ టూరిజం సెంటర్. నిత్యం అక్కడికి ఎంతోమంది టూరిస్టులు వెళ్తుంటారు. ఈనేపథ్యంలో టూరిస్టుల కోసం ఒక ఆకర్షణీయమైన ప్యాకేజీని తెలంగాణ టూరిజం తీసుకొచ్చింది. దాని వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
తెలంగాణ టూరిజం అమలు చేస్తున్న ఈ ప్యాకేజీ పేరు ‘హైదరాబాద్ – నాగార్జునసాగర్ – హైదరాబాద్’. ఇందులో భాగంగా కేవలం ఒక్క రోజులోనే హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ టూరుకు వెళ్లి రావచ్చు. ప్రతీ శని, ఆదివారాల్లో ఈ టూర్ ఉంటుంది. నాన్ ఏసీ బస్సులో ప్రయాణ ఏర్పాట్లు చేస్తారు. బస్సులో ఉదయం బయలుదేరితే, రాత్రికల్లా ఇంటికి చేరుకోవచ్చు. ఈ ప్యాకేజీలో పెద్దలకు టికెట్ ధర రూ. 800. పిల్లలకు టికెట్ ధర రూ. 640. బోటింగ్, ఎంట్రీ, భోజన వసతి ఖర్చులన్నీ టూరిస్టులే భరించాలి. వాటిని టూర్ ప్యాకేజీలో కవర్ చేయరు. ఈ ప్యాకేజీ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని భావించేవారు https://tourism.telangana.gov.in/package/nagarjunasagartour వెబ్‌సైటును సందర్శించాలి.
Also Read :UPI Block Mechanism : యూపీఐతోనే షేర్లు కొనొచ్చు, అమ్మొచ్చు.. సెబీ కీలక ప్రతిపాదన
ప్రతి శని, ఆదివారాల్లో ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్ పర్యాటక భవన్ నుంచి నాగార్జున సాగర్‌కు బస్సు బయలుదేరుతుంది. ఉదయం 8 గంటలకు బషీర్‌బాగ్‌కు బస్సు చేరుకుని, అక్కడి నుంచి సాగర్‌కు ప్రయాణాన్ని మొదలుపెడుతుంది. ఉదయం 11:30 గంటలకు నాగార్జున సాగర్‌కు బస్సు చేరుకుంటుంది. ఉదయం 11:40 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు బుద్ధవనం ప్రాజెక్టును టూరిస్టులు చూస్తారు. లంచ్ బ్రేక్ తర్వాత నాగార్జునకొండకు లాంచీలో ప్రయాణం ఉంటుంది. అక్కడ నాగార్జున సాగర్ మ్యూజియం, నాగార్జునకొండను పర్యాటకులు విజిట్ చేస్తారు. బోటింగ్ కూడా చేయొచ్చు. చివరగా సాయంత్రం 4 గంటలకు నాగార్జున సాగర్ డ్యామ్‌ను(Nagarjuna Sagar Tour) సందర్శకులు చూస్తారు. సాయంత్రం 5 గంటలకు నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్‌కు బస్సు తిరిగి బయలుదేరుతుంది. రాత్రి 9 గంటలకల్లా హైదరాబాద్‌కు చేరుకుంటారు.