Murmu’s Presidential: ముర్ము అభ్యర్థిత్వం.. తెలంగాణ బీజేపీకి బలం!
ఎన్‌డిఎ అభ్యర్థిగా పార్టీ గిరిజన నేత ద్రౌపది ముర్మును ప్రకటించడం పట్ల (ఎస్‌టి) కమ్యూనిటీకి దగ్గరవ్వాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది.
- By Balu J Updated On - 02:30 PM, Wed - 22 June 22

రాష్ట్రపతి ఎన్నికలకు బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ అభ్యర్థిగా పార్టీ గిరిజన నేత ద్రౌపది ముర్మును ప్రకటించడం పట్ట షెడ్యూల్డ్ తెగల (ఎస్‌టి) కమ్యూనిటీకి దగ్గరవ్వాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. ద్రౌపది అభ్యర్థిత్వం కచ్చితంగా తెలంగాణ బీజేపీకి అదనపు బలం చేకూర్చనుంది. తెలంగాణలో. 64 ఏళ్ల ముర్ము ఎన్నికైతే, భారత రాష్ట్రపతి అయిన మొదటి గిరిజన మహిళ. 2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాలపై దృష్టి సారించేందుకు బీజేపీ నాయకత్వం ఇప్పటికే తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలో ఎస్సీలకు 19, ఎస్టీ వర్గాలకు 12 నియోజకవర్గాలు రిజర్వు చేయబడ్డాయి. ఈ నియోజకవర్గాలకు పార్టీ కార్యక్రమాలను తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేసేందుకు బీజేపీ ‘మిషన్ 19’, ‘మిషన్ 12’ పేరుతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.
బీజేపీ లోక్‌సభ సభ్యుడు సోయం బాపురావు ఇప్పటికే ఎస్టీ వర్గానికి చెందిన ప్రముఖ నేత. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎస్టీలకు రిజర్వ్ అయిన ఆదిలాబాద్ నుంచి ఆయన టీఆర్‌ఎస్‌ను ఓడించారు. వైఎస్సార్‌సీపీ, ఏఐఏడీఎంకే తదితర ప్రాంతీయ పార్టీల మద్దతుతో పాటు అన్ని రాష్ట్రాల ఎంపీలు, ఎమ్మెల్యేలతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు ఉన్న స్పష్టమైన మెజార్టీతో ముర్ము ఎన్నిక కావడం ఖాయమని తెలంగాణ బీజేపీ నేతలు బలంగా భావిస్తున్నారు.
Related News

Bakrid : బక్రీద్ సందర్భంగా అధికారులతో హైదరాబాద్ సీపీ రివ్యూ మీటింగ్
హైదరాబాద్: త్వరలో జరగనున్న బక్రీద్ పండుగ ఏర్పాట్ల కోసం నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సాలార్ జంగ్ మ్యూజియంలో అన్ని శాఖల అధికారులు, ముస్లిం మతపెద్దలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముస్లిం మతపెద్దలు వీధులను పరిశుభ్రంగా ఉంచేంలా చూడాలని విజ్ఞప్తి చేశారు. జీహెచ్‌ఎంసీ చేపడుతున్న పారిశుద్ధ్య చర్యలపై సమీక్షించారు. 300 శానిటేషన్ వాహనాలు, అదనంగా 55 వాహనాలు నేరుగా పో