Murder : హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌లో యువకుడు దారుణ హత్య
హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్‌లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో తరుణ్‌పై షరీఫ్ అనే వ్యక్తి దాడి
- Author : Prasad
Date : 24-10-2023 - 4:16 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్‌లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో తరుణ్‌పై షరీఫ్ అనే వ్యక్తి దాడి చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపుతుంది. హత్య జరిగే సమయంలో స్థానికులు అప్రమత్తమై కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తరుణ్‌ను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ దురదృష్టవశాత్తు మృతి చెందాడు. దీంతో పోలీసులు తరుణ్ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు షేక్ షరీఫ్‌ను పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ, ఎస్‌ఆర్ నగర్ ఏసీపీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్య సమయంలో ఇంకా ఎవరైనా నిందితులు ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితుడు షరీఫ్‌కి ఉరిశిక్ష వేయాలంటూ మృతుడు తరుణ్ కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. గతంలో షరీఫ్ తరుణ్‌ని చంపుతానని ఛాలెంజ్ చేశాడని.. మూడు నెలల తరువాత తరుణ్‌పై పగబట్టి హత్య చేశాడని తరుణ్ కుటుంబసభ్యులు ఆరోపించారు.
Also Read: 7 Killed : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి