Telangana BJP : తెలంగాణ లో బిజెపి భారీ షాక్..కీలక నేత రాజీనామా
- Author : Sudheer
Date : 11-01-2024 - 11:50 IST
Published By : Hashtagu Telugu Desk
త్వరలో పార్లమెంట్ ఎన్నికలు (Lok Sabha Elections) సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ లో బిజెపి పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీమంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు, యువనేత విక్రమ్ గౌడ్ (Mukesh Goud Son Vikram Goud Resigns) పార్టీ కి రాజీనామా చేసారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షులు , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి పంపించారు. క్రమశిక్షణకు మారు పేరంటూ పెద్ద నాయకులు కొట్టుకుంటుంటే చోద్యం చూస్తున్నారని, పార్టీ లో కొత్తవారిని అంటరాని వారీగా చూస్తున్నారని, పార్టీ కోసం ఏమీ ఆశించకుండా పని చేసినా గుర్తింపు ఇవ్వడం లేదని , ప్రజాబలం లేని వారికి పెద్దపీట వేసి వారి కింద పనిచేయాలని చెబుతున్నారని లేఖలో పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విక్రమ్..గోషామహల్ టికెట్ ఆశించారు. కానీ అధిష్టానం రాజాసింగ్‌కు టిక్కెట్టు కేటాయించింది. విక్రమ్ గౌడ్ తండ్రి ముఖేష్ గౌడ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. అయితే రాజకీయా పరిణామాల క్రమంలో బీజేపీలో చేరిన విక్రమ్ గౌడ్ గత కొంతకాలంగా పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఉండడంతో గోషామహల్ టికెట్‌ను ఆశించారు. అయితే ఎన్నికల సమయంలో రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేసిన అధిష్టానం.. ఆ తర్వాత ఆయనకే టిక్కెట్టు కన్ఫామ్ చేయడం తో విక్రమ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఆ తర్వాత కూడా పార్టీ నేతలు విక్రమ్ కు ఎలాంటి భరోసా ఇవ్వకపోవడం..అసలు పట్టించుకోకపోవడంతో విక్రమ్ ఫైనల్ గా బిజెపికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈయన కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు.
Read Also : Hyderabad : సినీ నటిపై యువకుడు దాడి ..పెళ్లి పేరుతో రూమ్ కు పిలిచి