HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Modi Fire On Brs Congress

Kaleshwaram : కాళేశ్వరం పేరుతో బిఆర్ఎస్ కోట్ల రూపాయలు దోచుకుంది – ప్రధాని మోడీ

  • By Sudheer Published Date - 01:15 PM, Tue - 5 March 24
  • daily-hunt
Modi Brs
Modi Brs

పటాన్‌చెరులో ఏర్పాటుచేసిన బీజేపీ విజయ సంకల్ప సభ (BJP Vijaya Sankalpa Sabha)లో ప్రధాని మోడీ (Modi) బిఆర్ఎస్ , కాంగ్రెస్ (BRS-COngress) పార్టీలపై విరుచుకపడ్డారు. కాళేశ్వరం (Kaleshwaram Lift Irrigation Project) పేరుతో గత బిఆర్ఎస్ ప్రభుత్వం కోట్ల రూపాయలు దోచుకుందని ఆరోపించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా పటాన్ చెరు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 9 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను మోడీ ప్రారంభించారు. మంగళవారం ఉదయం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సంగారెడ్డిలో పర్యటించి పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్బంగా బిఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల ఫై నిప్పులు చెరిగారు. నాణేనికి ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్‌ ఉన్నాయని, ఆ రెండు పార్టీలు కుమ్మక్కయైట్లు ప్రజలందరికీ అర్థమైందని మోడీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్​ రెండు పార్టీలు ఒక్కటేనని దుయ్యబట్టారు. కాళేశ్వరం పేరుతో బిఆర్ఎస్ కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం తప్పులను కాంగ్రెస్ దాస్తుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణను కొత్త ఏటీఎంగా మార్చుకుందని ఆరోపించారు. నేనే మోడీ కుటుంబం అని సభికులతో నినాదాలు చేయించిన ప్రధాని, తెలంగాణ యువత స్వప్నాలను సాకారం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ దిశగానే 70 ఏళ్లలో కాంగ్రెస్‌ చేయలేని పనిని పదేళ్లలో చేసి చూపామని ప్రధాని ఉద్ఘాటించారు.

కోట్లాది ఎస్సీ యువత స్వప్నాలను సాకారం చేసినట్లు తెలిపిన ప్రధాని, తెలంగాణలో మాదిగల అభ్యున్నతి కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అవినీతిని బయటపెడుతున్నాననే అక్కసుతో, నాపై కాంగ్రెస్‌ విమర్శిస్తోంది. కుటుంబ పాలన సాగించే వారిలో అభద్రతా భావం ఎక్కువ. కుటుంబ పార్టీల నేతలు సొంత ఖజానా నింపుకుంటున్నారు. వారసత్వ నేతలకు భయం పట్టుకుంది. వారి అవినీతి దళాన్ని వెలికితీస్తున్నా, ప్రజల నమ్మకాన్ని నేనెప్పుడూ వమ్ము కానివ్వను. దోచుకున్న నల్లధనం దాచుకోవడానికే విదేశాల్లో ఖాతాలు తెరిచారు. 140 కోట్ల మంది ప్రజలే నా కుటుంబం.’ అని మోదీ వ్యాఖ్యానించారు.

Read Also : 2008 DSC Candidates : ప్రజా భవన్ వద్ద డీఎస్సీ 2008 బాధితుల ఆవేదన..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • congress
  • Kaleshwaram Lift Irrigation Project
  • modi

Related News

Kavitha

Kavitha : బిఆర్ఎస్ విఫలమైంది..అందుకే మీము రంగంలోకి దిగుతున్నాం – కవిత

Kavitha : తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్న వేళ, రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటంలో విపక్షాలు తమ బాధ్యతను నిర్వర్తించలేకపోయాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రంగా విమర్శించారు

  • Rjd

    Bihar Elections : ఆర్జేడీ భంగపాటుకు ప్రధాన కారణం వారితో పొత్తే !!

  • Bihar Elections Bjp

    BJP : బీజేపీ నెక్ట్స్ టార్గెట్ ఏంటో తెలుసా..?

  • Local Body Elections

    Local Body Elections: స‌ర్పంచ్ ఎన్నిక‌లపై బిగ్ అప్డేట్‌.. ఆరోజే క్లారిటీ?!

  • Cm Revanth Jubli

    Jubilee Hills Bypoll Result : ఫలించిన రేవంత్ వ్యూహాలు

Latest News

  • Delhi Blast: ఢిల్లీ రెడ్ ఫోర్ట్ పేలుడు కేసులో కీలక విషయాలు వెల్లడి!

  • Andhra Pradesh : ఏపీలోని ఆ జిల్లాకు శుభవార్త..దశ తిరిగినట్టే.!

  • Vegetarian Snacks: అద్భుతమైన ప్రోటీన్‌ను అందించే 5 శాఖాహార ఆహారాలివే!

  • Coach Gambhir: హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రయోగాలు భారత్‌కు భారంగా మారుతున్నాయా?

  • TG TET-2026: టీజీ టెట్-2026 అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. నేటి నుండి..!

Trending News

    • Former PM Sheikh Hasina : షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు భారత్ అప్పగిస్తుందా..?

    • Andre Russell: ఐపీఎల్‌లో ఆండ్రీ రసెల్ కోసం రెండు జ‌ట్ల మ‌ధ్య పోటీ?!

    • Maoist Hidma : వందల మంది మృతికి హిడ్మానే కారణం!

    • Madvi Hidma : ఏపీలో భారీ ఎన్‌కౌంటర్.. మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ, అగ్రనేత హిడ్మా హతం.!

    • Nitish Kumar: బీహార్ సీఎంగా నితీష్ కుమార్.. మంత్రిత్వ శాఖలకు న‌యా ఫార్ములా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd