MLC Kavitha: నటుడు అర్జున్ తో ఎమ్మెల్సీ కవిత.. హనుమాన్ కు ప్రత్యేక పూజలు!
చెన్నై (Chennai)లో పర్యటిస్తున్న కల్వకుంట్ల కవిత (MLC Kavitha) సినీ హీరో అర్జున్ (Actor Arjun)తో కలిసి పూజలు చేసింది.
- Author : Balu J
Date : 10-02-2023 - 3:18 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రముఖ ఆంగ్ల పత్రిక నిర్వహించనున్న సదస్సులో పాల్గొనడానికి చెన్నై (Chennai)లో పర్యటిస్తున్న టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) సినీ హీరో అర్జున్ (Actor Arjun) సర్జ నిర్మించిన హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అర్జున్ దంపతులు కల్వకుంట్ల కవిత (MLC Kavitha) కు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ.. చెన్నైలో పర్యటించడం తనకు ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని తెలిపారు.
తమిళనాడు (Tamilnadu) అస్తిత్వం చాలా గొప్పదని, అక్కడి ప్రజలు స్ఫూర్తిదాయకంగా ఉంటారని అన్నారు. తమిళనాడు ప్రజలు తమ సంస్కృతి భాష చరిత్ర వారసత్వం పట్ల గర్వంగా ఉంటారని, ప్రతి ఒక్కరికి ఆ గౌరవభావం ఉండాలని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆలోచన తత్వం భారతీయులను ఐక్యంగా ఉంచుతుండడం గర్వంగా ఉందని తెలిపారు. దేశంలోని అతిపెద్ద హనుమాన్ దేవాలయాన్ని నిర్మించినందుకు అర్జున్ కు కవిత (MLC Kavitha) అభినందనలు తెలిపారు.
Also Read: RC15 Update: శంకర్ స్కెచ్.. పొలిటికల్ లీడర్ గా రామ్ చరణ్ !