RC15 Update: శంకర్ స్కెచ్.. పొలిటికల్ లీడర్ గా రామ్ చరణ్ !
RC15 సినిమాలో చరణ్ ను ఓ రాజకీయ నాయకుడి (Political Leader) గా చూపిస్తున్నాడట శంకర్.
- Author : Balu J
Date : 10-02-2023 - 2:58 IST
Published By : Hashtagu Telugu Desk
రామ్ చరణ్, భారీ చిత్రాల డైరెక్టర్ శంకర్ కలయికలో తెరకెక్కుతున్న కొత్త మూవీ ఎన్నో అంచనాలు రేపుతోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే రామ్ చరణ్ (Ram Charan) చేస్తున్న RC15 సినిమా గురించి బయట చాలానే లీకులు ఉన్నాయి. సినిమా ఘాట్ అల్మోస్ట్ అవుట్ డోర్ లోనే జరుగుతుండటంతో ఇప్పటికే చాలా ఫోటోలు , వీడియోస్ లీకయ్యాయి. అయితే సినిమా కంటెంట్ కూడా లీకవుతూ వస్తుంది. ఈ సినిమాలో చరణ్ ను ఓ రాజకీయ నాయకుడి (Political Leader) గా చూపిస్తున్నాడట శంకర్.
ఫ్లాష్ బ్యాక్ లో చరణ్ పార్టీ (Ram Charan) పెట్టడం, ఉద్యమం చేయడం లాంటివి ఉంటాయట. శ్రీకాంత్ ఇందులో మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. అతని కొడుకు పాత్రలో ఎస్ జె సూర్య కనిపించనున్నాడు. చరణ్ తో శంకర్ పక్కా పొలిటికల్ డ్రామా తీయనున్నాడన్నమాట. ఫ్లాష్ బ్యాక్ లో చరణ్ సరికొత్తగా కనిపించనున్నాడని లీకైనా (Leaks Pics) ఫోటోలో చూస్తే తెలుస్తుంది. ఇప్పటి వరకు చరణ్ ను చూడని విదంగా శంకర్ ప్రెజెంట్ చేస్తున్నాడు. చరణ్ (Ram Charan) ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్నాడు.
తండ్రి , కొడుకులుగా నటిస్తున్నాడు. ఫ్లాష్ బ్యాక్ లో తండ్రి పాత్రతో చరణ్ నటుడిగా మరింత ఉన్న స్థాయికి చేరుకోవడం పక్కా అని ఇన్సైడ్ టాక్. పొలిటికల్ స్పీచ్ లతో అదరగొడతాడని తెలుస్తుంది. వచ్చే ఏడాది ఎలక్షన్స్ వేడిలో ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు దిల్ రాజు. వచ్చే ఏడాది సంక్రాంతి లేదా సమ్మర్ (Summer) లో సినిమా థియేటర్స్ లోకి రానుంది. ఇప్పటికే రాంచరణ్ బాబాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీలో ఎన్నికల సమర శంఖం పూరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మూవీ పవన్ రాజకీయ మైలేజీకి ఉపయోగపడవచ్చునని పలువురు భావిస్తున్నారు.
Also Read: CM KCR: ఇకపై అటవీ ప్రాంతాల్లో ఒక్క చెట్టు కూడా కొట్టనివ్వం: సీఎం కేసీఆర్