HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Mlc Kavitha Open Letter To Cm Revanth Reddy

Kavitha : సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ

అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న ఆందోళన ధర్మబద్దమని హైకోర్టు కూడా గుర్తించి నియామకాల ప్రక్రియకు బ్రేకులు వేసిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యమనే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తించాలన్నారు.

  • Author : Latha Suma Date : 18-04-2025 - 2:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
MLC Kavitha open letter to CM Revanth
MLC Kavitha open letter to CM Revanth

Kavitha : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దుచేసి పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఈ మేరకు ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ చేశారు. గ్రూప్-1 నిర్వహించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగుల జీవితాలు అగాధంలోకి నెట్టి వేయబడ్డాయని చెప్పారు. అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న ఆందోళన ధర్మబద్దమని హైకోర్టు కూడా గుర్తించి నియామకాల ప్రక్రియకు బ్రేకులు వేసిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యమనే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తించాలన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.

Read Also: DANGER: రోజంతా కూర్చొని పనిచేస్తున్నారా?

ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీ లోపించిందని విమర్శించారు. యువత జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడడం ఆక్షేపనీయమన్నారు. గ్రూప్‌ -1 పరీక్ష నిర్వహించిన తీరు, ఫలితాల వెల్లడిపై అభ్యర్థుల్లో అనేక సందేహాలున్నాయని చెప్పారు. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వేర్వేరు హాల్‌టికెట్ నెంబర్ల కేటాయింపుతో గందరగోళం నెలకొందన్నారు. జవాబు పత్రాల మూల్యాంకనంపైనా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని వెల్లడించారు. గ్రూప్- 1 పరీక్ష నిర్వహించిన తీరు, ఫలితాల వెల్లడిలో అనేక లోపాలు, అవకతవకలు ఉన్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదంటే పారదర్శకంగా ఉద్యోగ నియామకాల పట్ల మీకు ఏ మేరకు చిత్తశుద్ది ఉందో తేటతెల్లమవుతుంది. ఉద్యోగాల నియామకాల్లో పారదర్శకత, జవాబుదారి లోపించిందన్న విమర్శలు వస్తున్నాయి.

తెలంగాణ యువతకు, మరీ ముఖ్యంగా నిరుద్యోగులకు అనేక ఆశలు చూపి అధికారంలోకి వచ్చిన మీరు వారి జీవితాలతో చెలగాటమాడుతున్న తీరు ఆక్షేపనీయం. గ్రూప్- 1 పరీక్ష నిర్వహించడంలో ప్రభుత్వ నిర్వక్ష్యం వల్ల వేలాది మంది నిరుద్యోగుల జీవితాలు అగాధంలోకి నెట్టివేయబడ్డాయి. గ్రూప్‌ -1 పరీక్షలపై అభ్యర్థులు దాఖలు చేసిన కేసులు న్యాయస్థానాల పరిధిలో ఉండగానే గౌరవ ముఖ్యమంత్రి గారైన మీరు, మీ కేబినెట్‌ లోని పలువురు మంత్రివర్యులు గ్రూప్‌ -1 నియమకాల గురించి పలు సందర్భాల్లో మాట్లాడారు. త్వరలోనే ఈ నియామకాల ప్రక్రియ ముగించబోతున్నట్టు ప్రకటించారు. ఇలాంటి ప్రకటనలు కూడా అభ్యర్థుల్లో అనుమానాలు పెరగడానికి కారణమయ్యాయి అని కవిత లేఖలో పేర్కొన్నారు.

Read Also: Bhagavad Git : భగవద్గీతకు యునెస్కో గుర్తింపు

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • Group 1 Exam
  • open letter
  • telangana

Related News

New Airports In Ap

New Airports in Telangana : జూన్ లో 2 ఎయిర్పోర్టులకు శంకుస్థాపన?

వరంగల్ చారిత్రక నగరానికి పర్యాటక రంగంలో కొత్త కళ రానుండగా, ఆదిలాబాద్ జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి విమాన సౌకర్యం ఒక వరంగా మారనుంది

  • Tg Assembly Session

    TG Assembly Session : నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

  • No shortage of cooking gas in Telangana: Uttam Kumar Reddy

    Telangana : తెలంగాణలో వంటగ్యాస్ కొరత పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టత

  • Son Writes Exam Hours After Father's Death

    గుండెపోటుతో తండ్రి మృతి.. కన్నీళ్లతో పరీక్షకు కొడుకు..!

  • Telugu States IRCTC Special Trains

    తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణీకులకు కేంద్రం గుడ్‌న్యూస్

Latest News

  • మీ గుండె ఆరోగ్యాన్ని పరీక్షించే సులభమైన మార్గం ఇదే!

  • ఊతకర్రల సాయంతో న‌డుస్తున్న టీమిండియా ప్లేయ‌ర్‌.. వీడియో ఇదే!

  • ఆర్‌సీబీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌!

  • అమరావతిలో అమర జీవికి అద్భుత నివాళి….!!

  • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

Trending News

    • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

    • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

    • ఇకపై వీరికి ఎల్‌పిజి సిలిండర్లు లభించవు!

    • ఏప్రిల్ 2026 శుక్ర గోచరం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd