HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Mlc Kavitha Hot Comments On Congress

MLC Kavitha: ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది: ఎమ్మెల్సీ క‌విత‌

ఆరు గ్యారెంటీలతో సామాన్య ప్రజలకు దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఉద్యోగులను అలాగే మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా పీఆర్సీ వేయలేదన్నారు.

  • Author : Gopichand Date : 07-06-2025 - 9:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
MLC Kavitha
MLC Kavitha

MLC Kavitha: ఆరు గ్యారెంటీలతో ప్రజలను, ఆశపెట్టి ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) మండిపడ్డారు. తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నాయకులు శనివారం సాయంత్రం నిజామాబాద్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ కవితతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల కు ముందు కాంగ్రెస్ పార్టీ ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చిందన్నారు.

ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు ఇవ్వడంతో పాటు డీఏలు ఎప్పటికప్పుడు చెల్లిస్తామని, పీఆర్సీ ద్వారా మెరుగైన ఫిట్ మెంట్ ఇస్తామనే హామీలతో పాటు ఉద్యోగులకు ఎన్నో వాగ్దానాలు చేసిందని గుర్తు చేశారు. ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకపోగా ఐదు డీఏలను పెండింగ్ లో పెట్టి ఉద్యోగులను ఇబ్బంది పెడుతోందన్నారు. జులై ఒకటిన చెల్లించాల్సిన మరో డీఏను కలువుకుంటే మొత్తం ఆరు డీఏ లను ఈ ప్రభుత్వం ఉద్యోగుల కు బాకీ పడిందన్నారు. ఇప్పుడు ఒక జీవో ఆరు నెలల తర్వాత ఇంకో జీవో ఇస్తామని ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం అంటే ఉద్యోగుల ను వంచించడమే అన్నారు.

Also Read: YCP : రాజధాని మహిళలను అవమానిస్తే కాలగర్భంలో కలిసిపోతారు – లోకేష్

ఆరు గ్యారెంటీలతో సామాన్య ప్రజలకు దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఉద్యోగులను అలాగే మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా పీఆర్సీ వేయలేదన్నారు. కనీసం మధ్యంతర భృతి ఇచ్చే ప్రయత్నం చేయకపోగా ఉద్యోగులను నిందించేలా ప్రభుత్వం మాట్లాడుతోందన్నారు. దసరా పండగలోపు పెండింగ్ లో ఉన్న ఆరు డీఏల్లో మూడు డీఏలు ఇవ్వకపోతే ఉద్యోగుల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. వెంటనే పీఆర్సీ నియమించి ఉద్యోగులకు మెరుగైన ఫిట్ మెంట్ ఇవ్వాలని, పీఆర్సీ అమలు చేసే వరకు ఉద్యోగులకు ఐఆర్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవితను కలిసిన వారిలో తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అధ్యక్షులు నాగరాజు, రేవంత్, తదితరులు ఉన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం కించపరిచిందని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. శనివారం జగిత్యాలలో ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వారిని విస్మరించిందన్నారు. ఉద్యోగుల కు పెండింగ్ లో ఉన్న డీఏలు విడుదల చేస్తామని చెప్పి కేవలం ఒక్క డీఏ విదిల్చారని.. ప్రభుత్వం తీరుపై ఉద్యోగులంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, బాధపడుతున్నారని అన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే నెరవేర్చాలని, పెండింగ్ డీఏలన్నీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • cm revanth
  • Congress Govt
  • MLC Kavitha
  • telangana news

Related News

Gandhi Sarovar Musi

Gandhi Sarovar : వారం రోజుల్లో ‘గాంధీ సరోవర్’కు శంకుస్థాపన!

గాంధీ సరోవర్ పరిసరాల్లో ఆధ్యాత్మికతను చాటేలా ఒక భారీ మసీదు నిర్మాణానికి కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మసీదు నిర్మాణానికి సౌదీ అరేబియా యువరాజు సహకరించేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం అందుతోంది.

  • Cm Revanth Vs Aravind

    CM Revanth : మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు

  • Cm Revanth Key Update On Fr

    Free Scooty Scheme in Telangana : ఫ్రీగా స్కూటీలపై కీలక అప్డేట్

  • Shivapratap Shukla Appointed As Telangana New Governor

    నేడు హైదరాబాద్‌కు కొత్తగవర్నర్ రాక.. స్వాగతం పలకనున్న సీఎం రేవంత్ రెడ్డి

  • Cm Revanth Good News

    Free Electric Scooters: కాలేజీ అమ్మాయిలకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

Latest News

  • అంతర్జాతీయ క్రికెట్‌లో 5 ఏళ్లు పూర్తి చేసుకున్న టీమిండియా కెప్టెన్‌!

  • భారత్‎కు బిగ్ రిలీఫ్..హొర్ముజ్‌ దాటిన 2 భారత ఎల్పీజీ నౌకలు

  • పాక్ క్రికెట్ బోర్డుకు షాక్ ఇచ్చిన జింబాబ్వే స్టార్ పేసర్

  • వేసవిలో బాడీ డీహైడ్రేట్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • టాలీవుడ్ లో విషాదం.. సీనియర్‌ నిర్మాత ఎం.అర్జునరాజు కన్నుమూత

Trending News

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd