HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Lokesh Warning To Ycp Media

YCP : రాజధాని మహిళలను అవమానిస్తే కాలగర్భంలో కలిసిపోతారు – లోకేష్

YCP : "అమరావతి దేవతల రాజధాని కాదు.. వేశ్యల రాజధాని" అని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన లోకేష్, ఇది నెత్తిన నిండుగా ఉమ్మినట్లేనని ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.

  • By Sudheer Published Date - 09:01 PM, Sat - 7 June 25
  • daily-hunt
Lokesh Warning
Lokesh Warning

అమరావతి(Amaravathi)పై, ముఖ్యంగా అక్కడి మహిళలపై వైసీపీ మీడియా (YCP Media) చేసిన అవమానకర వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “అమరావతి దేవతల రాజధాని కాదు.. వేశ్యల రాజధాని” అని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన లోకేష్, ఇది నెత్తిన నిండుగా ఉమ్మినట్లేనని ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. అమరావతిలో భూములు త్యాగం చేసిన మాతృమూర్తులకే ఇది రాజధాని అని, మహిళలను అవమానించే వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని హెచ్చరించారు. అసత్య ప్రచారంతో మహిళల గౌరవాన్ని కించపరిచే విధంగా వైఎస్సార్‌సీపీ వ్యవహరిస్తోందని విమర్శించారు.

Minister Savita : వివాదంలో ఏపీ మంత్రి సవిత..ఆలస్యంలో వెలుగులోకి వచ్చిన ఘటన
అమరావతిని “దేవతల రాజధాని”గా అభివర్ణిస్తూ, జగన్ ప్రభుత్వాన్ని “దెయ్యం”గా పేర్కొన్నారు. రాష్ట్ర మహిళల పట్ల నిరుద్యోగకంగా వ్యవహరించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళల గౌరవాన్ని కాపాడే విధంగా పాలన సాగిస్తున్నారని, విద్యార్థి దశ నుంచే మహిళల పట్ల గౌరవ భావన పెంపొందించేందుకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. మహిళల ఆత్మాభిమానం మీద దాడి చేసేవారిని ఎంతటి దుర్మార్గులైనా ఉపేక్షించమని స్పష్టం చేశారు.

Tummala NageswaraRao : కాళేశ్వరం వివాదంపై తుమ్మల ..అబద్ధాల వలన సత్యం మారదు

ఇక తిరుపతిలో ఓ వ్యాపారిపై వైసీపీ అనుచరులు దాడికి పాల్పడిన ఘటనపై కూడా లోకేష్ స్పందించారు. కారుపాట్స్ వ్యాపారి మోహనరావుపై భూమన అభినయ్ అనుచరులు దాడి చేసిన వీడియోను పోస్ట్ చేస్తూ, రాష్ట్రంలో రౌడీలు, గూండాలకు స్థానం లేదన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి, భద్రతలకు ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. నిందితులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్టు ట్వీట్ చేశారు. వైసీపీ పాలనతో సైకో మానసికత పెరిగిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ చేష్టలకు అడ్డుకట్ట వేస్తుందని హెచ్చరించారు.

#YSRCPRowdyism
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అయిదేళ్ల అరాచక పాలనను భరించలేక ప్రజలు కూకటి వేళ్ళతో పెకలించారు. అయితే ఏడాది గడిచినా వైసీపీ పిల్ల సైకోలు పాత వాసనలు వీడకుండా అక్కడక్కడా దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. తిరుపతిలో మోహనరావు అనే కారు స్పేర్ పార్టుల వ్యాపారి నుంచి వాటాల కోసం… pic.twitter.com/JVza5B0iLS

— Lokesh Nara (@naralokesh) June 7, 2025

#YCPinsultsWomen
మహిళల్ని అవమానించిన వారు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం@ysjagan గారు! మహిళలను ఇంత ఘోరంగా మీ మీడియా సాక్షిలో అవమానించవచ్చా? అమ్మల ఆత్మాభిమానం మీద, అమరావతి మీద విద్వేషంతో చేస్తున్న అసత్య ప్రచారం మీ దిగజారుడుతనానికి పరాకాష్ట! ఆకాశంపై ఉమ్మేయాలనుకుంటే, అది మీ మీదే… pic.twitter.com/d4Pvmqy2AE

— Lokesh Nara (@naralokesh) June 7, 2025


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravathi
  • nara lokesh
  • ycp
  • YCP media

Related News

YSRCP's actions to tarnish the dignity of teachers are evil: Minister Lokesh

Nara Lokesh : టీచర్ల గౌరవాన్ని దెబ్బతీసే వైసీపీ చర్యలు దుర్మార్గమైనవి : మంత్రి లోకేశ్‌

సోషల్ మీడియాలో ఫేక్ హ్యాండిల్స్‌ను ఉపయోగించి అసత్య ప్రచారాలు చేయడం ద్వారా టీచర్లపై అపవాదులు మోపడం దారుణమని, ఇలాంటి చర్యలు అత్యంత ఖండనీయమని వ్యాఖ్యానించారు. వైసీపీకి చెందిన ఓ ఫేక్ సోషల్ మీడియా హ్యాండిల్‌ ఒక ఫోటోను పోస్ట్ చేసింది.

  • Nara Lokesh Pm Modi Yuvagalam Coffee Table Book Tdp Ap Govt

    Lokesh : నేడు ప్రధాని మోదీతో లోకేశ్ భేటీ

  • Nara Lokesh

    Nara Lokesh : ఢిల్లీలో ప్రధాని మోదీని కలవనున్న నారా లోకేశ్

  • Smart Kitchen

    Nara Lokesh: కడపలో తొలి స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన నారా లోకేశ్

  • Lokesh's satire on Jagan

    Vip Passes : ‘ఓరి నీ పాసుగాల’ ..కార్యకర్తలను కలిసేందుకు పాసులు ఏందయ్యా : జగన్‌ పై లోకేశ్ సెటైర్

Latest News

  • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

  • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

  • PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

  • Khairatabad Ganesh : గంగమ్మ ఒడికి బయలుదేరిన ఖైరతాబాద్ మహాగణపతి

  • Trade War : భారత్‌పై అమెరికా వాణిజ్య కార్యదర్శి తీవ్ర వ్యాఖ్యలు

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd