Telangana: బీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్
మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కాంగ్రెస్ కి రాజీనామా చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్ర శేఖర్ ఈరోజు బీఆర్ఎస్ లో చేరారు.
- By Praveen Aluthuru Published Date - 05:03 PM, Sun - 29 October 23

Telangana: మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కాంగ్రెస్ కి రాజీనామా చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్ర శేఖర్ ఈరోజు బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఎర్ర శేఖర్ గులాబీ పార్టీలో చేరారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తానని ఎర్ర శేఖర్ అన్నారు.
ఎర్ర శేఖర్ మూడుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. తాను మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్న సమయంలో కేసీఆర్ తో కలిసి పనిచేశానని గుర్తు చేశారు . రాష్ట్రంలో ముదిరాజ్ సామాజికవర్గ అభ్యున్నతికి రూపొందించిన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకే పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు .
గతంలో ముదిరాజ్ సంఘం పరిస్థితి దయనీయంగా ఉండేది కానీ ఇప్పుడు చేప పిల్లల పంపిణీ, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలు సంఘం సభ్యుల్లో గుణాత్మక మార్పులు తీసుకొచ్చాయి అని తెలిపారు.
Also Read: Mouse – Space : అంతరిక్షంలో ఎలుకల పిండాలు.. ఏమైందంటే ?