Seasonal Diseases: సీజనల్ వ్యాధుల నిర్మూలనపై మంత్రి కీలక సమావేశం
తెలంగాణ వైద్య విధాన పరిషత్ ను డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ విభాగంగా బలోపేతం చేయడానికి అధికారులు రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను మంత్రి దామోదర్ రాజనర్సింహ పరిశీలించారు.
- By Gopichand Published Date - 09:46 PM, Fri - 29 November 24

Seasonal Diseases: రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాద్ లోని సచివాలయంలో సీజనల్ వ్యాధుల నిర్మూలన (Seasonal Diseases), తెలంగాణ వైద్య విధాన పరిషత్ ను డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ గా బలోపేతం చేయడంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో పాటు ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సిస్టంపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రజారోగ్య శాఖ ఆధ్వర్యంలోనీ ప్రాథమిక ఆసుపత్రిలో అందిస్తున్న సేవల బలోపేతంపై మంత్రి చర్చించారు. సీజనల్ వ్యాధులు విస్తరించకుండా ప్రాథమిక ఆసుపత్రులలో అవసరమైన సిబ్బంది, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాలలో సీజనల్ వ్యాధులు విస్తరించకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మంత్రి ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ ను ఆదేశించారు.
తెలంగాణ వైద్య విధాన పరిషత్ ను డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ విభాగంగా బలోపేతం చేయడానికి అధికారులు రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను మంత్రి దామోదర్ రాజనర్సింహ పరిశీలించారు. ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సిస్టం పై డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ గారితో చర్చించారు. రాష్ట్రంలో అన్ని బోధన ఆసుపత్రులలో ఉన్న బెడ్స్ సామర్థ్యం పెంపుపై చర్చించారు. వీటితోపాటు పొరుగు సేవలను అందించే ఏజెన్సీల పనితీరుపై మంత్రికి చర్చించారు. బోధన ఆసుపత్రులలో ఏజెన్సీ లు, వాళ్లకి చెల్లించే పేమెంట్లు, కోర్టు కేసుల సత్వర పరిష్కారం మార్గాలను అన్వేషించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
Also Read: TRAI Traceability Guidelines: డిసెంబర్ 1 తర్వాత ఓటీపీలో ఈ మార్పులు.. ప్రభావం ఉంటుందా?
త్వరలో ప్రారంభించే నర్సింగ్ కళాశాలల ఏర్పాట్లు, ట్రాన్స్ జెండర్ల క్లినిక్ లు, కొత్తగా 108, 102 అంబులెన్స్ల సేవలను ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. డైరెక్టర్ హెల్త్, పరిధిలోని బోధన ఆసుపత్రులలో డాక్టర్ల నియామకాల పై మంత్రి దామోదర్ రాజనర్సింహా చర్చించారు. ఈ సమీక్షలో ఉస్మానియా, గాంధీ, ప్లేట్ల బురుజు ఆస్పత్రులలో బెడ్ల (పడకల) సామర్థ్యం పై చర్చించారు. ఉస్మానియా బోధన ఆసుపత్రి పరిధిలోని ఆస్పత్రులలో NMC నిబంధనల మేరకు బేడ్ల సామర్థ్యం పై చర్చించారు. అలాగే గాంధీ ఆసుపత్రి, ప్లేట్ల బుర్జు ఆస్పత్రి లో పడకల సామర్థ్యం పెంపు పై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సమీక్ష సమావేశంలో IVF సెంటర్ సేవలను విస్తృతపరచాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆర్వి కర్ణన్, Tgmsidc ఎండి హేమంత్ వాసుదేవరావు, డీఎంఈ డాక్టర్ వాణీ, డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ రవీందర్ నాయక్, రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, డిప్యూటీ డీఎంఈ విమల థామస్ లు పాల్గొన్నారు.