HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ministers Key Advice To Farmers Call To Plant Those Crops

Key Advice To farmers: రైతుల‌కు మంత్రి కీలక సూచ‌న‌.. ఆ పంట‌లు వేయాల‌ని పిలుపు..!

రైతులు తమ పొలాల్లో ఆయిల్ ఫాం, డ్రాగన్ ,పండ్ల తోటలు, కూరగాయలు తదితర పంటలకు అవకాశం ఇవ్వాలని ఆదాయం అధికంగా వస్తుందని అధికారులు రైతులకు సూచనలు చేశారు.

  • Author : Gopi Date : 07-08-2024 - 9:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Key Advice To farmers
Key Advice To farmers

Key Advice To farmers: రైతులు వ్యవసాయ అనుబంధ పథకాలను లబ్ధి పొంది ఆర్థిక వృద్ధి చెందాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Key Advice To farmers) ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకోసం హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న 42 రైతు వేదిక క్లస్టర్ల ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. హుస్నాబాద్ మండలంలోని మీర్జాపూర్ లో మొదటి అవగాహన సదస్సు నిర్వహించారు. హుస్నాబాద్ కరువు పీడిత ప్రాంతమని కరువుల్లో రైతులు ఆదుకునేందుకు పశువులు మాత్రమే అడుకుంటాయని తెలిపారు. రైతు వేదికల్లో అవగాహన ద్వారా నిరుద్యోగ యువత ,రైతులు స్వయం శక్తి ద్వారా స్వయంగా ఎదగడానికి తొడ్పడుతుందన్నారు.సదస్సులో జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, జిల్లా అధికారులు ,మండల వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. గ్రామ క్లస్టర్ పరిధిలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొని వారి సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

రైతులు తమ పొలాల్లో ఆయిల్ ఫాం, డ్రాగన్ ,పండ్ల తోటలు, కూరగాయలు తదితర పంటలకు అవకాశం ఇవ్వాలని ఆదాయం అధికంగా వస్తుందని అధికారులు రైతులకు సూచనలు చేశారు. ఆయిల్ ఫాం లో అంతర్ పంట సాగు చేయడానికి ఎకరానికి 4200 ఇవ్వడంతో పాటు ఫర్టీలైజర్స్ అందిస్తున్నారు. పట్టు పరిశ్రమల ద్వారా ఆదాయం భారీగా ఉంటుందని తెలిపారు. ఈ పంట అతివృష్టి ,అనావృష్టి వచ్చిన పంటకు ఇబ్బందులు ఉండవని అటవీ పందులు,జంతువుల బెడద ఉండదన్నారు. పట్టు పురుగులు ప్రారంభం అయిన తరువాత నెల రోజుల్లోనే పంట వస్తుందన్నారు.

వెటర్నరీ లో భాగంగా మంచి పథకాలు ఉన్నాయని వాటిని ఉపయోగించుకోవాలని సూచించారు. గొర్రెల పెంపకంలో 500 గొర్రెలు ,25 పొట్టేలు ఒక యూనిట్ గా 5 ఎకరాల భూమి కలిగి ఉండి కోటి రూపాయల స్కీమ్ లో 50 లక్షల సబ్సిడీ మిగిలిన దానిలో బ్యాంక్ లోన్ తో పాటు కొంత రైతు చెల్లించుకునే స్కీమ్ చాలా బాగుంటుందని అధికారులు రైతులకు సూచించారు. ఇందులోనే తక్కువలో 100 గొర్రెలు, 5 పొట్టేలు, ఒక యూనిట్ గా 20 లక్షల స్కీమ్ లో 10 లక్షల సబ్సిడీ రాగ మిగిలిన దానిలో బ్యాంక్ లోన్, రైతు స్వయంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కోళ్ళ పెంపకంలో నాటు కోళ్లు , కడక్ నాథ్ కోళ్లు 1000 పెట్టెలు ,20 పుంజులు ఒక యూనిట్ గా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకం ఉందని దానిని ఉపయోగించుకోవాలని సూచించారు. పాడి పశువుల పెంపకానికి లక్ష నుండి 20 లక్షల మధ్య ఒక యూనిట్ గా ఉన్న పథకాలకు కేంద్రం సబ్సిడీ అందించే పథకాలు ఉన్నాయని రైతులు వారికి నచ్చిన పశువులు కొనుక్కోవచ్చు. ఉపాధి హామీ పథకం లో భాగంగా ఆయిల్ ఫాం, డ్రాగన్ ,మునగ ,కొబ్బరి , మల్బరీ, మామిడి తోటల పెంపకానికి పశువుల పాక, పందుల షెడ్డు కు ఆర్థిక సహకారం ఉంటుందని సూచించారు. దీనికి జాబ్ కార్డు కచ్చితంగా ఉండాలన్నారు.

Also Read: Uttar Pradesh: జేపీ నడ్డా పేరుతో ఎమ్మెల్యే నుంచి రూ.1.25 లక్షల డిమాండ్, నిందితుడు అరెస్ట్

గ్రామాల్లో చెరువుల్లో చేప పిల్లలు వేసి చేపల పెంపకం చేయవచ్చని సొంతంగా పంటకు పనికి రాని భూములను చేపల చెరువులుగా మార్చి అక్కడ చేపల పెంపకం చేయవచ్చని తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ వైఎస్ఆర్ హయంలో ప్రారంభిస్తే త్వరలోనే మేము పూర్తి చేస్తామని తమ ప్రభుత్వం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి కాలువల నిర్మాణానికి 437 కోట్ల రూపాయలు కేటాయించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గౌరవెల్లి నీళ్ళు అందేలోపే రైతులు వ్యవసాయదారిత ఇతర ఆదాయ వనరులపై దృష్టి సారించాలన్నారు. మహిళలకు తమ ప్రభుత్వం ప్రత్యేక పథకాలు తీసుకొచ్చిందని 10 లక్షల భీమా సౌకర్యం కల్పించిందన్నారు. మహిళా సంఘాలకు 20 లక్షల వరకు లోన్ తీసుకొని ఒక్క సభ్యురాలు కు 2 లక్షల వరకు తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. క్లస్టర్ పరిధిలో సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని గ్రామాలను శుభ్రంగా ఉంచుకోవాలని డ్రింకింగ్ వాటర్ కలుషితం కాకుండా చూసుకోవాల‌ని తెలిపారు.

కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి మాట్లాడుతూ.. గొర్రెలు, ఆవులు, ఆయిల్ ఫాం, డ్రాగన్ తదితర వాటికి సబ్సిడీ ఉన్నాయని రైతులు ఉపయోగించుకోవాలని సూచించారు. ఏఏ పథకానికి బ్యాంక్ లోన్‌కి అవసరమైన షీట్ ను రూపొందిస్తామని తెలిపారు. రైతు రుణమాఫీ ఇప్పటికే లక్ష 50 వేల రూపాయల వరకు రైతు రుణమాఫీ పూర్తయిందని, ఎవరికైనా ఇబ్బంది ఉంటే AEOలకు వివరాలు ఇవ్వాలన్నారు. రైతు వేదికల వద్ద ఈ అవగాహన సదస్సు ఉపయోగించుకోవాలని సూచించారు. సమావేశంలో వివిధ విభాగాల జిల్లా అధికారులు, మండల అధికారులు పాల్గొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • agriculture
  • Govt Schemes
  • Minister Ponnam
  • telangana
  • TG News

Related News

Pavan Kalyan (1)

JSP : హైద‌రాబాద్‌లో జ‌న‌సేన స‌భ‌కు పోలీసుల అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

రేపు (జూన్ 2వ) గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్‌లో జరగాల్సిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నవ నిర్మాణ సంకల్ప సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. తెలంగాణ రాజకీయ రంగంలో పార్టీ ఉనికిని బలోపేతం చేసే లక్ష్యంతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్‌కు రానున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 2,000 మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొంటార

  • Heavy Rain Forecast for Telangana

    Weather Report: తెలంగాణకు భారీ వర్షసూచన

  • T Congress

    Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

  • Komatireddy

    Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • Jaggareddy

    TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

Latest News

  • NRI TDP : డల్లాస్ లో నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాంకు ఘనసత్కారం

  • Cockroach Janata Party: భారత్‌కు రానున్న కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు

  • Cm Vijay: నా కడుపులో బిడ్డ చావుకు సీఎం విజయే కారణం: సంచలన ఆరోపణలు చేసిన నటి

  • CBN : డీఎస్సీ నుంచి విగ్రహాల ఘటనల వరకు వైసీపీ కుట్ర‌ల‌పై సీఎం ఫైర్

  • Bluetooth Name: కొంప ముంచిన బ్లూటూత్‌.. విమానం యూటర్న్‌.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd