HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Minister Sridhar Babu Reviewed The Assembly Meetings With The Officials

Minister Sridhar Babu: అసెంబ్లీ సమావేశాలపై అధికారులతో సమీక్షించిన మంత్రి శ్రీధర్ బాబు

సోమవారం నుంచి అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు ప్రారంభం కానున్న సందర్బంగా స్పీకర్ ప్రసాద్ కుమార్, కౌన్సిల్ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తో కలిసి ఆయన పోలీసు, పౌర అధికారులతో ఏర్పాట్ల గురించి సమీక్ష జరిపారు.

  • Author : Gopichand Date : 09-12-2024 - 12:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Minister Sridhar Babu
Minister Sridhar Babu

Minister Sridhar Babu: అసెంబ్లీ సమావేశాలపై అధికారులతో శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) ఆదివారం స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రధాన గేట్ల వద్ద ఉండే పోలీసు సిబ్బంది కొత్తగా ఎన్నికైన శాసన సభ్యులను గుర్తించడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని, ఇకపై అటువంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు.

సోమవారం నుంచి అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు ప్రారంభం కానున్న సందర్బంగా స్పీకర్ ప్రసాద్ కుమార్, కౌన్సిల్ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తో కలిసి ఆయన పోలీసు, పౌర అధికారులతో ఏర్పాట్ల గురించి సమీక్ష జరిపారు. సమావేశాల సందర్భంగా అసెంబ్లీ పరిసరాల్లో గట్టి బందోబస్తును ఏర్పాటు చేయాలని సూచించారు. తనిఖీలు చేపట్టి సమావేశ మందిరంలోకి నిషేధిత వస్తువులను సభలోకి తీసుకురాకుండా చూడాలని ఆదేశించారు. ఛైర్మన్, స్పీకర్ ల పర్యటనల్లో ప్రోటోకాల్ సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలని ఆదేశించారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిని గౌరవ, మర్యాదలతో చూడాల్సిన బాధ్యతను మర్చిపోరాదని అన్నారు.

Also Read: Team India: అడిలైడ్ టెస్టులో ఓడిపోయిన టీమిండియా డ‌బ్ల్యూటీసీ ఫైనల్ ఆడగలదా?

సభ్యులు అడిగిన రాతపూర్వక ప్రశ్నలకు వివిధ శాఖల నుంచి నిర్దేశించిన గడువులోగా సమాధానాలు వచ్చే విధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీలు చూడాలని కోరారు. వేర్వురుగా జరిగిన సమీక్షా సమావేశాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, డిజిపి డా. జితేందర్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ సి.వి.ఆనంద్, శాంతి భద్రతల అదనపు డిజిపి మహేశ్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డిజి నాగిరెడ్డి, సైబరాబాద్ సిపి అవినాశ్ మహంతి, రాచకొండ సిపి సుధీర్ బాబు, ఇంటెలిజెన్స్ ఐజిపి కార్తికేయ, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ తఫ్సీర్ ఇక్బాల్, ఎస్.బి డిసిపి చైతన్య కుమార్, ఎస్పిఎఫ్ కమాండెంట్ పి.ఎస్. రావు, తదితరులు పాల్గొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Assembly meetings
  • cm revanth
  • congress
  • hyderabad
  • Minister Sridhar Babu
  • telangana
  • telugu news

Related News

Harish Rao

రాజకీయాల్లో అబద్ధాలు ఆడటంలో రేవంత్ కు ‘నోబెల్ ప్రైజ్’ ఇవ్వాలి – హరీష్ రావు

తెలంగాణ లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ , అధికార పార్టీ కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడినప్పటికీ, ప్రజలు బిఆర్ఎస్ కు ఘన విజయం అందించారని తెలిపారు.

  • Cm Revanth Kodangal

    ఈ నెల 24న కొడంగల్ లో పర్యటించబోతున్న సీఎం రేవంత్

  • CM Revanth Reddy

    లంచాలు తీసుకుంటున్న ప్రభుత్వ అధికారులపై సీఎం రేవంత్ సీరియస్

  • Christmas Holidays 2025 Sch

    విద్యార్థులకు శుభవార్త..క్రిస్మస్ సెలవులు వచ్చేశాయ్!

  • Maoists Khali

    తెలంగాణలో పెద్ద ఎత్తున లొంగిపోయిన మావోలు

Latest News

  • వాట్సాప్ లో కొత్త మోసం జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతి !

  • టీమిండియాకు బిగ్ షాక్‌.. డ‌బ్ల్యూటీసీలో ఆరో స్థానానికి ప‌డిపోయిన భార‌త్‌!

  • జిల్లాల అధ్యక్షులను ప్రకటించిన టీడీపీ

  • రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. డిసెంబర్ 26 నుండి పెరగనున్న ఛార్జీలు!

  • టీ20 క్రికెట్ చరిత్ర.. ఒకే సిరీస్‌లో అన్ని టాస్‌లు గెలిచిన కెప్టెన్లు వీరే!

Trending News

    • క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?

    • 2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd