HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Minister Seethakka Fire On Ktr Words On Womens

Minister Seethakka: కేసీఆర్ మీకు నేర్పిన గౌరవం సంస్కారం ఇదేనా కేటీఆర్‌.. మంత్రి సీత‌క్క ఫైర్‌..!

మీ తండ్రి కేసీఆర్ మీకు నేర్పిన గౌరవం సంస్కారం ఇదేనా కేటీఆర్? మీ ఆడపడుచులు అంతా బ్రేక్ డాన్స్ లు చేస్తున్నారా? ఆడవాళ్ళంటే మీకు గౌరవం లేదు. మహిళల పట్ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని ఆమె అన్నారు.

  • Author : Gopi Date : 15-08-2024 - 6:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Minister Seethakka
Minister Seethakka

Minister Seethakka: తెలంగాణ మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ పై మంత్రి సీతక్క (Minister Seethakka) తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. ఆర్టిసి బస్సుల్లో మహిళలు బ్రేక్ డ్యాన్స్‌లు, రికార్డింగ్ డ్యాన్స్‌లు చేసుకోవచ్చ‌ని కేటీఆర్ అత్యంత జుగుప్సకరంగా మాట్లాడిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై మంత్రి సీత‌క్క కేటీఆర్‌పై ఫైర్ అయ్యారు.

ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. మీ తండ్రి కేసీఆర్ మీకు నేర్పిన గౌరవం సంస్కారం ఇదేనా కేటీఆర్? మీ ఆడపడుచులు అంతా బ్రేక్ డాన్స్ లు చేస్తున్నారా? ఆడవాళ్ళంటే మీకు గౌరవం లేదు. మహిళల పట్ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని ఆమె అన్నారు. అంతేకాకుండా కేటీఆర్ భేషరతుగా తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. ఆడవాళ్ళను కించపరిచే విధంగా బ్రేక్ డాన్సులు చేసుకోండి అనడం మీ బుర్రలో ఉన్న బురదకు నిదర్శనం. గత పది సంవత్సరాలు హైదరాబాద్‌లోని క్లబ్బులు, పబ్బులు, బ్రేక్ డాన్సులు ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Also Read: Anjeer Benefits : మీరు ఈ 4 సమస్యల నుండి బయటపడాలంటే అంజీర్ పండ్లను తినడం ప్రారంభించండి..!

మహిళలు ఆర్థికంగా ఎదగాలని మహిళల కోసం సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్నాం. అందులో భాగంగా పేద మహిళలకు రవాణా భారాన్ని తగ్గించేందుకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశాం. శ్రమజీవులు, శ్రామిక మహిళలు ప్రయాణ సమయంలో సమయం వృథా చేయకుండా ఏదో పని చేసుకుంటే తప్పేంటి? ఇంటి వద్ద చేసుకునే చిన్నా చితక పనులు బస్సుల్లో చేసుకుంటే.. వారిని బ్రేక్ డాన్స్ లు వేసుకోమనడం దుర్మార్గమ‌ని మండిప‌డ్డారు. మహిళలు బ్రేక్ డాన్స్ లు చేసుకోండి అనే మాటలు నీ నోటికి ఎలా వచ్చాయి కేటీఆర్..? మీరు మాట్లాడిన మాటలు అత్యంత అసభ్యకరంగా ఉన్నాయి. మహిళలు పట్ల అసభ్యకర మాటలు మాట్లాడిన కేటీఆర్ తీరును ఖండిస్తున్నాను అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణ మహిళలను బ్రేక్ డాన్స్ చేసుకొండి అనే ధైర్యం ఎలా వచ్చింది కేటీఆర్..? తెలంగాణ మహిళలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి. అలాగే బీఆర్ఎస్ క్రమాపణ చెప్పాలి. ప్రజలకు ఉపయోగపడే పథకాలు మీకు నచ్చవు. ఉచిత బస్సు ప్రయాణ ఆలోచన మీకు రాలేదు.. పదేండ్లు మీరు చేయలేదు. మేము చేస్తే దాని మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆర్టీసీలో ప్రయాణాలు చేసేవాళ్లు తప్పుడు పనులు చేస్తున్నారన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. గుమ్మడికాయ దొంగలు అంటే కేటీఆర్ భుజాలు తడుముకోవడం ఎందుకు..? కేటీఆర్ తక్షణ మహిళలకు బహిరంగక్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • congress
  • ktr
  • Minister Seethakka
  • telangana

Related News

KTR

ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

కేటీఆర్ ట్వీట్ చేస్తూ, “నిన్న రాత్రి, హైదరాబాద్, వరంగల్, వైజాగ్, విజయవాడ, నాగ్‌పూర్‌లకు చెందిన 100 మందికి పైగా పారిశ్రామికవేత్తలు, వ్యాపార నాయకులతో ఏకాంతంగా చర్చించే అవకాశం నాకు లభించింది. ఈ సంభాషణలో మౌలిక సదుపాయాలు, పరిపాలన, రాజకీయాలు, వ్యక్తిగత ప్రయాణాలపై చర్చ జరిగింది.” అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకత్వం, ముఖ్యంగా కేటీఆర్, పాత కథనాలనే పునరావృతం చేయడం, తప్పుడు ఘనతను

  • MIssing Case

    Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Engineering counselling in Telangana begins today.

    TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

  • Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

    LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

  • Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

    Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

Latest News

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

  • Relationship: మీ భార్య కోపంగా ఉందా…? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి… కోపం కరిగిపోతుంది…!!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd