Minister Seethakka: కేసీఆర్ మీకు నేర్పిన గౌరవం సంస్కారం ఇదేనా కేటీఆర్.. మంత్రి సీతక్క ఫైర్..!
మీ తండ్రి కేసీఆర్ మీకు నేర్పిన గౌరవం సంస్కారం ఇదేనా కేటీఆర్? మీ ఆడపడుచులు అంతా బ్రేక్ డాన్స్ లు చేస్తున్నారా? ఆడవాళ్ళంటే మీకు గౌరవం లేదు. మహిళల పట్ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని ఆమె అన్నారు.
- Author : Gopichand
Date : 15-08-2024 - 6:25 IST
Published By : Hashtagu Telugu Desk
Minister Seethakka: తెలంగాణ మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ పై మంత్రి సీతక్క (Minister Seethakka) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టిసి బస్సుల్లో మహిళలు బ్రేక్ డ్యాన్స్‌లు, రికార్డింగ్ డ్యాన్స్‌లు చేసుకోవచ్చని కేటీఆర్ అత్యంత జుగుప్సకరంగా మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మంత్రి సీతక్క కేటీఆర్‌పై ఫైర్ అయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మీ తండ్రి కేసీఆర్ మీకు నేర్పిన గౌరవం సంస్కారం ఇదేనా కేటీఆర్? మీ ఆడపడుచులు అంతా బ్రేక్ డాన్స్ లు చేస్తున్నారా? ఆడవాళ్ళంటే మీకు గౌరవం లేదు. మహిళల పట్ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని ఆమె అన్నారు. అంతేకాకుండా కేటీఆర్ భేషరతుగా తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. ఆడవాళ్ళను కించపరిచే విధంగా బ్రేక్ డాన్సులు చేసుకోండి అనడం మీ బుర్రలో ఉన్న బురదకు నిదర్శనం. గత పది సంవత్సరాలు హైదరాబాద్‌లోని క్లబ్బులు, పబ్బులు, బ్రేక్ డాన్సులు ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Anjeer Benefits : మీరు ఈ 4 సమస్యల నుండి బయటపడాలంటే అంజీర్ పండ్లను తినడం ప్రారంభించండి..!
మహిళలు ఆర్థికంగా ఎదగాలని మహిళల కోసం సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్నాం. అందులో భాగంగా పేద మహిళలకు రవాణా భారాన్ని తగ్గించేందుకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశాం. శ్రమజీవులు, శ్రామిక మహిళలు ప్రయాణ సమయంలో సమయం వృథా చేయకుండా ఏదో పని చేసుకుంటే తప్పేంటి? ఇంటి వద్ద చేసుకునే చిన్నా చితక పనులు బస్సుల్లో చేసుకుంటే.. వారిని బ్రేక్ డాన్స్ లు వేసుకోమనడం దుర్మార్గమని మండిపడ్డారు. మహిళలు బ్రేక్ డాన్స్ లు చేసుకోండి అనే మాటలు నీ నోటికి ఎలా వచ్చాయి కేటీఆర్..? మీరు మాట్లాడిన మాటలు అత్యంత అసభ్యకరంగా ఉన్నాయి. మహిళలు పట్ల అసభ్యకర మాటలు మాట్లాడిన కేటీఆర్ తీరును ఖండిస్తున్నాను అన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తెలంగాణ మహిళలను బ్రేక్ డాన్స్ చేసుకొండి అనే ధైర్యం ఎలా వచ్చింది కేటీఆర్..? తెలంగాణ మహిళలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి. అలాగే బీఆర్ఎస్ క్రమాపణ చెప్పాలి. ప్రజలకు ఉపయోగపడే పథకాలు మీకు నచ్చవు. ఉచిత బస్సు ప్రయాణ ఆలోచన మీకు రాలేదు.. పదేండ్లు మీరు చేయలేదు. మేము చేస్తే దాని మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆర్టీసీలో ప్రయాణాలు చేసేవాళ్లు తప్పుడు పనులు చేస్తున్నారన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. గుమ్మడికాయ దొంగలు అంటే కేటీఆర్ భుజాలు తడుముకోవడం ఎందుకు..? కేటీఆర్ తక్షణ మహిళలకు బహిరంగక్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.