HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Minister Ponguleti Key Announcement On Indirammas Houses

Minister Ponguleti: ఇందిరమ్మ ఇండ్ల‌పై మంత్రి పొంగులేటి కీల‌క ప్ర‌క‌ట‌న‌!

గ‌త ప్ర‌భుత్వం ప‌ది సంవ‌త్స‌రాల‌లో ప్ర‌భుత్వ వ‌స‌తి గృహాల‌లో చ‌దువుకొనే విద్యార్ధుల మెస్ ఛార్జీల‌ను ఒక్క‌సారి కూడా పెంచ‌లేదు. త‌మ‌ ప్ర‌భుత్వం ఏడాదిలోపే 40 శాతం మెస్ ఛార్జీలు పెంచుతూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

  • Author : Gopi Date : 11-12-2024 - 11:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Minister Ponguleti
Minister Ponguleti

Minister Ponguleti: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న‌ను పకడ్బందీగా చేప‌ట్టాలని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి (Minister Ponguleti) శ్రీ‌నివాస‌రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న, గ్రూప్ -2 ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌, మెస్ ఛార్జీల‌పెంపు, సామాజిక స‌ర్వే త‌దిత‌ర అంశాల‌పై బుధవారం సచివాలయం నుంచి ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజా పాలనలో వచ్చిన 80 లక్షల దరఖాస్తుల ప‌రిశీల‌న‌ను ఈనెల 31వ‌తేదీలోగా పూర్తిచేయాలి. ప‌రిశీల‌న చేసిన స‌ర్వే వివ‌రాల‌ను మొబైల్ యాప్‌లో నమోదు చేయాలి. ప్రతి ఐదు వందల మందికి ఒక ఉద్యోగి ( సర్వేయ‌ర్‌)ను నియమించుకోవాలి. సర్వేలో ఇందిరమ్మ కమిటీ సభ్యులను కూడా భాగ‌స్వామ్యం చేయాలి. రాష్ట్రంలో ఎక్కడైనా ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు కాకపోతే వెంటనే ఏర్పాటు చేసుకోవాలి. ఏ గ్రామంలో సర్వే నిర్వహిస్తారో ఆ ముందు రోజు రాత్రి గ్రామంలో చాటింపు చేయాలి. అంతేగాక‌ స్థానిక పరిస్థితులను బట్టి క‌లెక్ట‌ర్‌లు ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఏ ఒక్క దరఖాస్తును విడిచిపెట్ట‌కుండా చిన్న చిన్న పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా పకడ్బందీగా సర్వే నిర్వహించాలి. సర్వే వివరాలపై ప్రతి రోజు కలెక్టర్లు సమీక్షించాలి. ప్రతి జిల్లా కేంద్రంలో ఫిర్యాదులు, సలహాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసుకోవాలి. ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం ఓ నిరంత‌ర ప్ర‌క్రియ ఈ ఏడాది 4.5 ల‌క్ష‌ల ఇండ్ల‌ను నిర్మించ‌బోతున్నామ‌ని కలెక్టర్లకు మంత్రి సూచించారు.

Also Read: 37th Hyderabad Book Fair : పుస్తక ప్రియులు ఎదురుచూసే సమయం రానేవచ్చింది

గ‌త ప్ర‌భుత్వం ప‌ది సంవ‌త్స‌రాల‌లో ప్ర‌భుత్వ వ‌స‌తి గృహాల‌లో చ‌దువుకొనే విద్యార్ధుల మెస్ ఛార్జీల‌ను ఒక్క‌సారి కూడా పెంచ‌లేదు. త‌మ‌ ప్ర‌భుత్వం ఏడాదిలోపే 40 శాతం మెస్ ఛార్జీలు పెంచుతూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణ‌యం వ‌ల్ల 7.65 ల‌క్ష‌ల మంది విద్యార్దుల‌కు ప్ర‌యోజ‌నం క‌లిగింది. క‌లెక్ట‌ర్లు త‌ర‌చూ హాస్టళ్ల‌ను త‌నిఖీ చేసి విద్యార్ధుల‌కు అందించే స‌రుకుల క్వాలిటీ, క్వాంటిటీపై ప్ర‌ధానంగా దృష్టి సారించాలి. ఈనెల 14వ తేదీన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్ల‌మెంటు స‌భ్యులు స్థానికంగా ఉన్న సంక్షేమ హాస్ట‌ళ్ల‌ను సంద‌ర్శించి అక్క‌డే విద్యార్ధుల‌తో క‌లిసి స‌హ‌పంక్తి భోజ‌నం చేస్తామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో విద్యార్ధుల త‌ల్లిదండ్రులు కూడా పాల్గొనాలని తెలిపారు.

సామాజిక స‌ర్వే

రాష్ట్రంలో 1 కోటి 16 ల‌క్ష‌ల కుటుంబాల‌కు గాను 1 కోటి 12 ల‌క్ష‌ల కుటుంబాల సామాజిక స‌ర్వే (99.09 శాతం) పూర్తి చేయ‌డం జ‌రిగింది. ఇందుకు కృషి చేసిన అధికారుల‌కు ముఖ్య‌మంత్రి త‌ర‌పున‌, రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున ప్ర‌త్యేక అభినంద‌న‌లు, కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. ఈనెల 13వ తేదీ సామాజిక స‌ర్వేకు తుది గ‌డువు. ఆ త‌ర్వాత ప్ర‌జా పాల‌న సేవా కేంద్రాల‌లో కూడా కుటుంబ స‌ర్వే వివ‌రాల‌ను న‌మోదు చేసుకోవ‌చ్చు. ఈనెల 15, 16 తేదీల‌లో జ‌రిగే గ్రూప్‌-2 ప‌రీక్ష‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • hyderabad
  • Indiramma Houses
  • Minister Ponguleti
  • Ponguleti Good News
  • telangana
  • telangana politics
  • telugu news

Related News

Bail period ends... Bandi Bhagirath returns to Cherlapally Jail.

Bandi Bhageerath: ముగిసిన బెయిల్ గడువు.. మళ్లీ చర్లపల్లి జైలుకు బండి భగీరథ్

గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలే బెయిల్‌పై విడుదలైన ఆయన్ను పోలీసులు తిరిగి చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. న్యాయస్థానం మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో గురువారం అర్థరాత్రి వేళ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని జైలుకు పంపించారు. గతంలో నమోదైన ఈ తీవ్రమైన న

  • BRS leader Balka Suman released on bail from Chanchalguda Jail.

    Balka Suman: చంచల్‌గూడ జైలు నుంచి బీఆర్‌ఎస్‌ నేత బాల్క సుమన్‌కు బెయిల్‌ పై విడుదల

  • We will not spare anyone regarding the SIR issue; CM Revanth issues key directives to MLAs.

    Cm Revanth Reddy: SIR విషయంలో ఎవరినీ ఉపేక్షించబోము.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

  • Janasena strengthens its position in Telangana politics; another key decision taken recently.

    Janasena Party: తెలంగాణ రాజకీయాల్లో జనసేన బలోపేతం.. తాజాగా మరో కీలక నిర్ణయం

Latest News

  • RAPO 23: హీరోగా, దర్శకుడిగా రామ్ పోతినేని కొత్త సినిమా ఓపెనింగ్

  • Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రికులకు గుడ్ న్యూస్.. ఆధ్యాత్మిక సాహస యాత్రకు సిద్ధమా?

  • Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మధిరలో రైతు ఆశీర్వాద సభ రద్దు..

  • Bullet Train: హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్‌ రైలుకు మార్కింగ్‌ పనులు షురూ

  • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని అందుకే ఆడించలేదా?

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd