Viral Video : డ్యాన్స్ ఇరగదీసిన మంత్రి మల్లారెడ్డి..!!
తెలంగాణ మంత్రి మల్లా రెడ్డి...ఆయన గురించి తెలియనివారుండరు. మల్లారెడ్డి ఏ పని చేసినా...ఇట్లే హైలెట్ అవుతుంది.
- By hashtagu Published Date - 03:33 PM, Sat - 20 August 22

తెలంగాణ మంత్రి మల్లా రెడ్డి…ఆయన గురించి తెలియనివారుండరు. మల్లారెడ్డి ఏ పని చేసినా…ఇట్లే హైలెట్ అవుతుంది. అంతేకాదు నిత్యం వివాదాల్లోనూ ముందే ఉంటారు. తాజాగా కారు రూఫ్ టాప్ లో నిలబడి డ్యాన్స్ ఇరగదీశాడు మల్లారెడ్డి. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆరుపదుల వయస్సు వచ్చినా..ఏమాత్రం తగ్గేదేలేదంటున్నారు. కుర్రాడిలా స్టేప్పులు వేస్తూ ఇరగదీసేశారు.
మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో అధికార టీఆరెస్ ప్రజాదీవేన సభ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సభకు మార్గం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ వేలాది కార్లతో భారీ కాన్వాయ్ తో హైదరాబాద్ నుంచి మునుగోడు వెళ్లారు. ఈ ర్యాలీలో మల్లారెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగానే ఆయన తన కారుపై నిలబడి డ్యాన్సు లేస్తూ టాప్ లేపారు.
Minister @chmallareddyMLA sir pic.twitter.com/5jEBmi1UDX
— BSYBRS (@BSYBRS) August 20, 2022