HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Minister Ktr Strong Counter To Pm Modi Comments

TS : ప్రజల హక్కుల కోసం ఎవరితోనైనా ఎక్కడి దాకైనా పోరాడే ఏకైక టీమ్ బీఆర్ఎస్ – KTR

ప్రజల హక్కుల కోసం ఎవరితోనైనా ఎక్కడి దాకైనా పోరాడే ఏకైక టీమ్ బీఆర్ఎస్ పార్టీ అని మంత్రి కేటీఆర్ తెలిపారు

  • By Sudheer Published Date - 11:11 AM, Wed - 8 November 23
  • daily-hunt
Ktr Counter Modi
Ktr Counter Modi

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ (KTR) మరింత దూకుడు పెంచారు. ఏ ఫ్లాట్ ఫామ్ ను వదలకుండా బిఆర్ఎస్ ను గెలిపించాలని కోరుతూ వస్తున్నారు. ఓ పక్క జిల్లాలో సభలు , సమావేశాలు జరుపుతూనే మరోపక్క సోషల్ మీడియా లో ఇంటర్వూస్ ఇస్తూ ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కాంగ్రెస్ , బిజెపి పార్టీల ఫై విమర్శలు , కౌంటర్లు వేసి మరోసారి హైలైట్ అయ్యారు. మంగళవారం హైదరాబాద్ లో జరిగిన బిజెపి బీసీ ఆత్మ గౌరవ సభ (BC Atma Gourava Sabha)లో మోడీ (PM Modi) మాట్లాడిన మాటలకు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు కేటీఆర్.

బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి సీ- టీమ్ అని మోడీ అభివర్ణించడాన్ని కేటీఆర్ తప్పుపట్టారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ- టీమ్ అంటూ గతంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలనూ ఆయన గుర్తు చేశారు. తాము బీజేపీకి బీ-టీమ్ కాదు, కాంగ్రెస్‌కు సీ- టీమ్ కాదని తమది ముమ్మాటికీ టీ- టీమ్ అని, బీఆర్ఎస్ అంటేనే టీమ్ తెలంగాణ అని వ్యాఖ్యానించారు. ప్రజల హక్కుల కోసం ఎవరితోనైనా ఎక్కడి దాకైనా పోరాడే ఏకైక టీమ్ బీఆర్ఎస్ పార్టీ అని మంత్రి కేటీఆర్ తెలిపారు. నిన్నటి వరకు మత రాజకీయం చేశారు, నేడు కులరాజకీయానికి తెర తీశారని ప్రధాని మోడీ ఫై ధ్వజమెత్తారు.

We’re now on WhatsApp. Click to Join.

కేంద్రంలో 10 సంవత్సరాల బిజెపి ప్రభుత్వ హయాంలో దేశంలోని బీసీలకు అరణ్య రోదనే మిగిలిందని కేటీఆర్ విమర్శించారు. కనీసం బీసీల జనగణన కూడా చేయని పాలన మీది.. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను పెట్టని ప్రభుత్వం మీది..అందుకే బీజేపీ ముమ్మాటికీ బీసీల వ్యతిరేక పార్టేనని కేటీఆర్ అన్నారు. బీసీలంటే మోడీ దృష్టిలో బలహీనవర్గాలు మాత్రమేనని, అదే బీసీలను తాము బలమైన వర్గాలుగా భావిస్తామని కేటీఆర్ అన్నారు.

ఇదిలా ఉంటె నేడు బుధవారం నుంచి 28వ తేదీ వరకు తన ఎన్నికల ప్రచార షెడ్యూల్ ను విడుదల చేసారు కేటీఆర్. ఈ 20 రోజుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 16 నియోజకవర్గాల్లో రోడ్‌షోలు, మరో 14 నియోజకవర్గాల్లో రోడ్‌షోలతోపాటు బహిరంగ సభలు నిర్వహించనున్నారు. వీటితోపాటు హైదరాబాద్‌ సహా పలు నియోజకవర్గాల్లోని వివిధ వర్గాలతో సమావేశమవుతారు.

మంత్రి కేటీఆర్‌ ప్రచార షెడ్యూల్‌ చూస్తే..

8న- సంగారెడ్డి నియోజకర్గంలో రోడ్‌షో, బహిరంగ సభ
9న- ఆర్మూర్‌, కొడంగల్‌ నియోజకవర్గాల్లో రోడ్‌షో, బహిరంగ సభ
10న-సిరిసిల్లలో నామినేషన్‌
11న- జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీ, అపార్ట్‌మెంట్‌
అసోసియేషన్‌ ప్రతినిధులతో సమావేశం. శామీర్‌పేటలో ఎస్టీ సెల్‌ ప్రతినిధులతో భేటీ

15న- కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో రోడ్‌షో
16న- అంబర్‌పేట, ముషీరాబాద్‌లో రోడ్‌షో
17న- గోషామహల్‌, సికింద్రాబాద్‌లో రోడ్‌షో
18న- జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌లో రోడ్‌షో
19న- మెదక్‌, దుబ్బాక నియోజకవర్గాల్లో యువ సమ్మేళనం, సనత్‌నగర్‌, సికింద్రాబాద్‌ (కంటోన్మెంట్‌)లో రోడ్‌షో
20న- ఎల్‌బీనగర్‌లో రోడ్‌షో
21న-శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాల్లో రోడ్‌షో

22న- మల్కాజ్‌గిరి, ఉప్పల్‌లో రోడ్‌షో
23న- కోరుట్ల నియోజకవర్గంలో రోడ్‌షో,
బహిరంగసభ, వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్‌, చందుర్తి, మేడిపల్లి, రుద్రంగి మండలాల్లో రోడ్‌షో
24న- అచ్చంపేట, మక్తల్‌ నియోజకవర్గాల్లో రోడ్‌షో, బహిరంగసభ
26న- మంథని, పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల్లో రోడ్‌షో, బహిరంగ సభ
27న-ఖానాపూర్‌, చొప్పదండి నియోజకవర్గాల్లో రోడ్‌షో, బహిరంగ సభ
28న- వేములవాడ, సిరిసిల్ల, కామారెడ్డి నియోజకవర్గాల్లో రోడ్‌షో, బహిరంగసభ

Read Also : AP : రాబోయే రోజుల్లో ఏపీలో ‘జైలర్’ సినిమా కనిపించబోతుంది – RRR


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BC Atma Gourava Sabha
  • ktr
  • modi
  • modi comments
  • telangana

Related News

TGPSC

TGPSC: రేపు గ్రూప్- 2 తుది ఫలితాలు విడుదల?

మరోవైపు TGPSC నియామక ప్రక్రియలో వేగాన్ని ప్రదర్శిస్తూ ఉమెన్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్లోని ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టుల తుది ఫలితాలను గురువారం విడుదల చేసింది.

  • High Court

    High Court: నవంబర్ లేదా డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వ‌హిస్తే న‌ష్ట‌మేంటి?: హైకోర్టు

  • CM Revanth Reddy

    Telangana: టూరిజం కాంక్లేవ్‌లో తెలంగాణకు రూ. 15,279 కోట్ల పెట్టుబడులు.. 50 వేల ఉద్యోగాలు!

  • Modi Pawan Cbn

    Modi Tour : ఏపీలో మోడీ పర్యటన..ఎప్పుడంటే !!

  • Election Schedule

    Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

Latest News

  • Asia Cup Final: ఆసియా కప్ 2025 ఫైనల్‌.. దుబాయ్‌లో కట్టుదిట్టమైన భద్రత!

  • Good News : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..తగ్గనున్న కరెంట్ ఛార్జీలు

  • BCCI: బీసీసీఐలో కీలక మార్పులు.. కొత్త అధ్య‌క్షుడు, సెలెక్ట‌ర్లు వీరే!

  • Election Commission: బీహార్ ఎన్నికలకు 470 మంది కేంద్ర పరిశీలకులను నియమించిన ఈసీ!

  • CBN Meets Pawan : పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

Trending News

    • Stampede : విజయ్ ని అరెస్ట్ చేస్తారా ?.. CM స్టాలిన్ రియాక్షన్ ఇదే !!

    • TVK Vijay Rally in Stampede : అరగంటలోపే పెను విషాదం

    • TVK Vijay Rally in Karur Tragedy : విజయ్ సభలో తొక్కిసలాట..33 మంది మృతి

    • Online Sales: జీఎస్టీ తగ్గింపుతో పండుగ సందడి.. కొనుగోళ్ల జోరు, ఈ-కామర్స్ రికార్డులు!

    • Dasara Offers : ఆఫర్లు అనిచెప్పి ఎగబడకండి..కాస్త ఎక్స్పైరీ డేట్ చూసుకోండి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd