Telangana Formation Day 2023: తెలంగాణ ఉద్యమంలో బీజేపీదే కీలక పాత్ర
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని బీజేపీ ముందుండి నడిపించిందని ఆయన అన్నారు.
- By Praveen Aluthuru Published Date - 03:37 PM, Thu - 1 June 23
Telangana Formation Day 2023: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని బీజేపీ ముందుండి నడిపించిందని ఆయన అన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలను గోల్కొండ కోటలో బీజేపీ ఆధ్వర్యంలో జరగనున్నాయి. కేంద్రం ప్రభుత్వ తరుపున ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈ వేడుకలను జరపనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమాన్ని బీజేపీ ముందుండి నడిపించిందని, ఈ మేరకు తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరపనున్నట్టు కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర సాధనలో 1200 మంది ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. గోల్కొండ కోటలో జరగనున్న ఆవిర్భావ వేడుకలకు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారందరిని ఆహ్వానిస్తున్నామని కిషన్ రెడ్డి చెప్పారు. మరోవైపు ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాల రాజ్ భవన్ లలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుపుతామని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం బీజేపీ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన సమయంలో కాంగ్రెస్ లాఠీలతో కొట్టించిందని కిషన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ నేత సుష్మ స్వరాజ్ కీలక పాత్ర పోషించినట్టు పేర్కొన్నారు. కాగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో బీజేపీ నిర్వహించనున్న ఈ ఆవిర్భావ వేడుకలు గోల్కొండ కోటలో 2023 జూన్ 02 శుక్రవారం జరగనున్నాయి. ఈ వేడుకల్లో జాతీయ జెండా ఎగురవేయనున్నారు కిషన్ రెడ్డి. అనంతరం కేంద్ర బలగాల కవాతుకు గౌరవ వందనం చేయనున్నారు.
Read More: Kirankumar Reddy : విభజన గాయంపై కిరణ్ గేమ్