Minister Harish Rao : ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు పోవడం ఖాయమన్న మంత్రి హరీష్ రావు
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ తెలంగాణ రాజకీయం జోరందుకుంది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ
- By Prasad Published Date - 03:15 PM, Wed - 4 October 23

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ తెలంగాణ రాజకీయం జోరందుకుంది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ నిన్న తెలంగాణలో పర్యటించి పలు అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేశారు. ఆయన సీఎం కేసీఆర్‌ని విమర్శించారు.ఇటు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ అసంతృప్త నేతలకు గాలం వేస్తుంది. పార్టీలో చేరికలతో టీకాంగ్రెస్ దూకుడుగా ఉంది. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే నినాదాన్ని టీ కాంగ్రెస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తుంది. అయితే కాంగ్రెస్ బలపడుతుండటంతో బీఆర్ఎస్ అలెర్ట్ అవుతుంది. రేవంత్ రెడ్డిని బలహీనం చేయడానికి ప్రభుత్వం పాత కేసులను తెరమీదకు తెస్తుంది. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమంటూ మంత్రి హరీష్ వ్యాఖ్యలు చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
కోస్గిలో 50 పడకల ప్రభుత్వాసుపత్రిని ప్రారంభించిన అనంతరం కొడంగల్‌లో జరిగిన బహిరంగ సభలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఈ కేసులో రేవంత్‌రెడ్డి పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిందని, దర్యాప్తు పురోగతిలో ఉండాలని స్పష్టం చేశారు. విచారణ ముందుకు సాగుతుందని, రేవంత్ జైలుకు వెళ్లడం ఖాయమని హరీశ్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం నుంచి టీడీపీ సభ్యుడిగా 2009, 2014లో రెండుసార్లు ఆ పార్టీ టికెట్‌పై గెలిచి, 2018లో కాంగ్రెస్‌లోకి మారి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. తదనంతరం 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన ఆయన, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.
Also Read: Telangana: రూ.900 కోట్ల ట్రైబల్ యూనివర్సిటీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం