HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Megastar Chiranjeevi Supports Chevella Mp Candidate Konda Vishweshwar Reddy

Megastar Chiranjeevi: కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని గెలిపించండి: మెగాస్టార్ చిరు

చేవెళ్ల లోకసభ స్థానంలో భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని చిరంజీవి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎక్స్ ద్వారా చిరు కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఎంతో కాలంగా నా స్నేహితుడు. నా కోడలు ఉపాసన ద్వారా దగ్గరి బంధువు కూడా.

  • Author : Vamsi Chowdary Korata Date : 11-05-2024 - 3:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Megastar Chiranjeevi
Megastar Chiranjeevi

Megastar Chiranjeevi: తెలంగాణలో లోకసభ ఎన్నికల పోరు తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా చేవెళ్ల లోక్ సభ స్థానంలో పోరు రసవత్తరంగా మారింది. ఈ స్థానం నుంచి 2014లో టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి గెలిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే కొన్ని పరిస్థితుల కారణంగా ఆయన బీజేపీలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈసారి బీజేపీ పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తున్నారు.

కొండాను ఎలాగైనా ఓడించి తీరాలనే పట్టుదలతో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ అందుకు తగ్గ వ్యూహాలను అనుసరిస్తుంది. ఈ క్రమంలో చేవేళ్ల స్థానంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల వ్యూహ ప్రతివ్యూహాలతో పోటీ నువ్వా, నేనా అన్నట్లుగా మారింది. దీంతో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి బలాబలాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన మెగాస్టార్ చిరంజీవి మద్దతుని కూడగట్టుకున్నారు. అటు మెగాస్టార్ కూడా కొండా అభ్యర్థిత్వాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా చిరంజీవి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

చేవెళ్ల లోకసభ స్థానంలో భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని చిరంజీవి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎక్స్ ద్వారా చిరు కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఎంతో కాలంగా నా స్నేహితుడు. నా కోడలు ఉపాసన ద్వారా దగ్గరి బంధువు కూడా. ఆయన సౌమ్యుడు, ఉత్తముడు. అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. ఇలాంటి వ్యక్తి రాజకీయంగా ముందుకువచ్చి సమాజానికి సేవలు అందించడం ఎంతైనా అవసరం. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినవారు. విద్యాధికుడు. ప్రజాసేవ, చేవెళ్ల ప్రాంత అభివృద్ధే లక్ష్యంగా భాజపా తరఫున బరిలో ఉన్నారు. గతంలో ఆయన చేసిన అభివృద్ధి మీకు తెలుసు. ఈ సందర్భంగా చేవెళ్ల ఓటర్లకు నా విజ్ఞప్తి. విలువైన ఓటును ఆయనకు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని వీడియోలో చిరంజీవి కోరారు.

Also Read: Allu Arjun : అల్లు అర్జున్ నంద్యాల పర్యటన.. వైసీపీపై చంద్రబాబు విమర్శలు..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chevella
  • Konda Vishweshwar Reddy
  • Lok Sabha polls 2024
  • megastar chiranjeevi
  • telangana

Related News

Pig Gives Birth To Elephant

పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ వింత ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ పంది, ఏనుగును పోలిన పిల్లకు జన్మనివ్వడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అచ్చం ఏనుగులా తొండం, పెద్ద చెవులతో జన్మించిన ఈ వింత జీవిని చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఈ ఘటన పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల గ్రామంలో చోటుచేసుకుంది. ఈ వింత జననానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర

  • Twins Same Marks in Intermediate Results 2026

    ఇంటర్ ఫలితాల్లో ఒకే మార్కులు సాధించిన కవలలు

  • Kalvakuntla Kavitha Warning

    Kalvakuntla Kavitha: తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం: కల్వకుంట్ల కవిత

Latest News

  • IPL 2026 – CSK : సంజూను కెప్టెన్ చేయాలంటూ డిమాండ్ !

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd