Mega Job Mela: నిరుద్యోగ యువతకు శుభవార్త.. సింగరేణి సహకారంతో మెగా జాబ్ మేళా!
రాష్ట్ర పౌర సరఫరాలు, ఇరిగేషన్ శాఖల మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో ఈ భారీ కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మంత్రి ఇటీవల ఆవిష్కరించారు. ఈ జాబ్ మేళా ద్వారా నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
- By Gopichand Published Date - 05:31 PM, Sun - 19 October 25

Mega Job Mela: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. తెలంగాణ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ (DEET) సహకారంతో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ఆధ్వర్యంలో అక్టోబర్ 25, 2025న హుజూర్‌నగర్‌లో మెగా జాబ్ మేళా (Mega Job Mela) నిర్వహించనున్నారు. రాష్ట్ర పౌర సరఫరాలు, ఇరిగేషన్ శాఖల మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో ఈ భారీ కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మంత్రి ఇటీవల ఆవిష్కరించారు. ఈ జాబ్ మేళా ద్వారా నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
Mega Job Mela In Huzurnagar On October 25
At least 150 companies will be participating in the Job Mela that will ensure around 5000 jobs. pic.twitter.com/UM3G0iKoUy
— Padmavathi Reddy (@uttampadmavathi) October 16, 2025
ముఖ్య వివరాలు
- తేదీ, సమయం: అక్టోబర్ 25, 2025, ఉదయం 8 గంటల నుండి.
- స్థలం (అడ్రస్): పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం వెనుక, హుజూర్‌నగర్ పట్టణం.
- కంపెనీలు, ఉద్యోగాలు: సుమారు 150కి పైగా ప్రైవేట్ సంస్థలు ఈ మేళాలో పాల్గొననున్నాయి. ఈ సందర్భంగా 2,000 నుండి 5,000 వరకు ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఉంది.
- అర్హతలు: పదవ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, MBA, B.Tech, P.G, ఫార్మసీ వంటి వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన 18-40 సంవత్సరాల వయస్సు గల యువతీ యువకులు అర్హులు.
Also Read: India vs Australia: తొలి వన్డేలో భారత్ ఘోర ఓటమి.. 1-0 ఆధిక్యంలోకి ఆస్ట్రేలియా!
నిరుద్యోగులు ఈ మేళాను సద్వినియోగం చేసుకోవడానికి తమ విద్యార్హత పత్రాలు, రెజ్యూమ్ కాపీలతో హాజరు కావాలని నిర్వాహకులు సూచించారు. రిజిస్ట్రేషన్ కోసం పోస్టర్‌పై ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. నిరుద్యోగ యువతకు ఒకే వేదికపై పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు పొందే అద్భుత అవకాశం కల్పిస్తున్న ఈ కార్యక్రమంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మరిన్ని వివరాలకు హెల్ప్‌లైన్ నంబర్‌లు: +91 9000937805, +91 9848997050, +91 9848409466.