HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Medak Collector Rahul Raj Teaches Trigonometry To Tenth Class Students

Medak Collector Rahul Raj: మ‌రోసారి టీచ‌ర్‌గా మారిన క‌లెక్ట‌ర్‌.. వీడియో వైర‌ల్‌

టీచ‌ర్‌గా మార‌ట‌మే కాకుండా మ్యాథ్స్‌లో క‌ష్టమైన త్రికోణ‌మితిని త‌నదైన శైలిలో చెప్పి విద్యార్థుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఏకంగా క‌లెక్ట‌రే త‌మ‌కు పాఠాలు చెప్ప‌డంతో విద్యార్థ‌లు సైతం ఆనందంలో మునిగిపోయారు.

  • Author : Gopi Date : 19-01-2025 - 8:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Medak Collector Rahul Raj
Medak Collector Rahul Raj

Medak Collector Rahul Raj: ఆయ‌నో ఓ జిల్లాకు క‌లెక్ట‌ర్ (Medak Collector Rahul Raj). పాల‌న సంబంధిత ప‌నులతోనే కాదు జిల్లాలోని ప్ర‌తి అభివృద్ధి కార్య‌క్ర‌మాల గురించి తెలుసుకుంటూ క్ష‌ణం తీరిక లేకుండా ఉంటారు. అయితే ఇంత బిజీలో కూడా క‌లెక్ట‌ర్ ఓ పాఠ‌శాల‌ను సంద‌ర్శించి అక్క‌డి విద్యార్థుల స‌మ‌స్య‌ల గురించి తెలుసుకున్నారు. పాఠ‌శాల్లోని స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం కూడా చూపారు. అలాగే ప‌ద‌వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు టీచ‌ర్‌గా మారిపోయారు. టీచ‌ర్‌గా మార‌ట‌మే కాకుండా మ్యాథ్స్‌లో క‌ష్టమైన త్రికోణ‌మితిని త‌నదైన శైలిలో చెప్పి విద్యార్థుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఏకంగా క‌లెక్ట‌రే త‌మ‌కు పాఠాలు చెప్ప‌డంతో విద్యార్థ‌లు సైతం ఆనందంలో మునిగిపోయారు.

పైన మ‌నం చెప్పుకున్న ఓ వ్య‌క్తి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌. ఆయ‌న స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా క‌లెక్ట‌ర్ అనే సంగ‌తిని మ‌ర్చిపోయి టీచ‌ర్‌గా మారుతున్నారు. ఆయ‌నలో ఉన్న నైపుణ్యాన్ని బ‌య‌ట‌పెడుతూనే ఉంటున్నారు. రాహుల్ రాజ్ ఇప్పుడే కాదు గ‌తంలో కూడా టీచ‌ర్ గా మారిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మ‌రోసారి టీచర్ అవతారం ఎత్తారు. శనివారం నాడు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా చేగుంట మండలం వడియారంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో పదవ తరగతి విద్యార్థులకు టీచర్ గా మారి పాఠాలు బోధించి ప్రశ్నలతో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి, అనంతరం భోజనశాలను, స్టోర్ రూమ్‌ను, సైన్స్ ల్యాబ్‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ప‌రిశీలించారు. పాఠ‌శాల‌లో టీచ‌ర్లుగా మారిన ఆయ‌న విద్యార్థుల‌కు పాఠాలు చెప్ప‌డంతోపాటు వారికి వ‌చ్చిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు కూడా చెప్పారు. పరీక్ష‌ల స‌మ‌యంలో విద్యార్థులు ఎలా స‌న్న‌ద్ధం అవ్వాలో కూడా క‌లెక్ట‌ర్ వారికి టిప్స్ ఇచ్చారు.

Also Read: US President Powers : అమెరికా ప్రెసిడెంట్‌కు ఉండే పవర్స్ గురించి తెలుసా ?

Medak Collector Rahul Raj teaches trigonometry to tenth class students at ZPHS – Nice !!

pic.twitter.com/b3edTru6uK

— Naveena (@TheNaveena) January 19, 2025

క‌లెక్ట‌ర్ రాహుల్ రాజ్ గ‌తంలో కూడా టీచ‌ర్‌గా అవ‌తారం ఎత్తారు. మెద‌క్ జిల్లాలోని శంక‌రంపేట ఆర్ మండ‌ల జిల్లా ప‌రిష‌త్ పాఠ‌శాల‌ను పరిశీలించారు. అప్పుడు కూడా ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు పాఠాలు బోధించారు. అయితే క‌లెక్ట‌ర్ ఇలా స‌మ‌యం దొరికినప్పుడ‌ల్లా టీచర్‌గా అవ‌తారం ఎత్త‌డంతో జిల్లాలోని ప‌లువురు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. క‌లెక్ట‌ర్ లాగే ఇత‌ర అధికారులు కూడా చొర‌వ తీసుకుంటే బాగుంటుంద‌ని ప‌లువురు త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chegunta
  • Mathematics
  • medak
  • Medak Collector
  • Medak Collector Rahul Raj
  • Rahul Raj
  • telangana
  • telugu news

Related News

New Policy on Fee Reimbursement in Telangana

Telangana Fee Reimbursement: తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కొత్త పాలసీ!

తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల దరఖాస్తు ప్రక్రియలో కీలకమైన సంస్కరణలు చేపట్టింది. ఇకపై ట్యూషన్ ఫీజుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్థుల పదో తరగతి మెమోలోని పేరు, ఇంటిపేరు వారి ఆధార్ కార్డులోని వివరాలతో కచ్చితంగా సరిపోలాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏమాత్రం తేడా ఉన్నా దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగదు. జాతీయ ఉపకార వేతనాల విధానానికి అనుగుణంగా

  • Purchase Of Grain Telangana

    Purchase of Grain : ధాన్యం కొనుగోలుపై ఎమ్మెల్యే ‘రోహిత్ ‘ కీలక ఆదేశాలు

  • Collector Preeti Singh

    Rice Purchases : కలెక్టర్ నిర్లక్ష్యం.. మెదక్ జిల్లాలో గాలికి వదిలేసిన ధాన్యం కొనుగోళ్లు

Latest News

  • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

  • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

  • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

  • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

  • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd