Mancherial fire accident: సజీవ దహనం కేసులో సంచలన విషయాలు.. పథకం ప్రకారమే హత్య
మంచిర్యాల (Mancherial) జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్‌లో ఇంటికి నిప్పంటుకొని (fire accident) ఆరుగురి సజీవ దహనమైన కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పథకం ప్రకారమే కొందరు ఆ ఇంటిని తగలబెట్టారని పోలీసులు గుర్తించారు. శాంతయ్య అనే సింగరేణి కార్మికుడు పద్మ అనే మహిళతో
- Author : Gopichand
Date : 18-12-2022 - 11:10 IST
Published By : Hashtagu Telugu Desk
మంచిర్యాల (Mancherial) జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్‌లో ఇంటికి నిప్పంటుకొని (fire accident) ఆరుగురి సజీవ దహనమైన కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పథకం ప్రకారమే కొందరు ఆ ఇంటిని తగలబెట్టారని పోలీసులు గుర్తించారు. శాంతయ్య అనే సింగరేణి కార్మికుడు పద్మ అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో రగిలిపోయిన శాంతయ్య భార్య సృజన, తన బంధువులతో కలిసి పద్మ ఇంటికి అర్ధరాత్రి నిప్పంటించింది.
మంచిర్యాల జిల్లాలో శనివారం జరిగిన ఆరుగురి సజీవ దహనం కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. మొదటి నుంచి పోలీసులు అనుమానిస్తున్నదే నిజం అయింది. ఆస్తి వివాదం, అక్రమ సంబంధం, వారసత్వ ఉద్యోగం నేపథ్యంలోనే హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. శాంతయ్య భార్య సృజన తన ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు పోలీసులు అనాధికారికంగా ధృవీకరిస్తున్నారు. ఊత్కూర్కు చెందిన శాంతయ్య శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే-5 గనిలో పని చేస్తూ.. మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామంలో శివయ్య ఇంట్లో అద్దెకు దిగాడు. అక్కడే ఆయన భార్య పద్మతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు రుజువు అయినట్లు సమాచారం.
Also Read: Pawan Kalyan : సత్తెనపల్లిలో జనసేన కౌలు రైతు భరోసా యాత్రకు పవన్ కల్యాణ్
ఈ క్రమంలో పద్మ మైకంలో పడిపోయిన శాంతయ్య ఇంటికి వెళ్లడం కూడా మానేశాడని.. ఇటీవల తన స్వగ్రామంలో భూమి అమ్మగా వచ్చిన డబ్బులు కూడా ఇవ్వకపోవడంతోనే ఈ దుశ్చర్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి శాంతయ్య భార్య సృజన తన ప్రియుడితో కలిసి శివయ్య కుటుంబం తినే ఆహారంలో మత్తు మందు కలిపారని, ఆ మత్తులో వారు నిద్రలోకి జారుకోగానే పెట్రోల్ పోసి ఇంటికి నిప్పు అంటించినట్లు పోలీసులు గుర్తించారు. ఇంటి సమీపంలో ఆరు పెట్రోల్ క్యాన్లను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు సృజన, ఆమె ప్రియుడితోపాటు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న జిల్లా ఎస్పీ.. 16 బృందాలను ఏర్పాటు చేసి గంటల వ్యవధిలోనే నిందితులను అదుపులోకి తీసుకోవడంతోపాటు కేసును ఓ కొలిక్కి తెచ్చారు.