TS : కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి కేటిఆర్ ఓర్వలేక పోతున్నాడు – మల్లు రవి
- By Sudheer Published Date - 03:11 PM, Mon - 26 February 24

అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుండడం తో ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి కేటిఆర్ (KTR) ఓర్వలేక పోతున్నాడని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి (Mallu Ravi) పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ లో కేటీఆర్ (KTR) మాట్లాడిన తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్లమెంట్ ఎన్నికల కోసమే కాంగ్రెస్ నాయకులు హామీలు అమలు చేస్తామంటున్నారని, ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ నైజమని , రాష్ట్రంలో గెలుపు కోసం కాంగ్రెస్ అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చిందని, రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు అదానీ, మోడీ మనిషని , కానీ ఇప్పుడు వారితో ఒప్పందాలు చేసుకొంటున్నారని కేటీఆర్ రేవంత్ సర్కార్ ఫై విమర్శలు చేసారు. ఈ విమర్శలపై మల్లు రవి స్పందించారు. అధికారంలోకి వచ్చిన రెండోరోజే ఆరు గ్యారంటీలలో రెండింటిని అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానాది అని తెలిపారు. మరో రెండు గ్యారెంటీలను రేపు చేవెళ్లలో అమలు చేయబోతున్నామని స్పష్టం చేశారు. రేవంత్ సర్కార్ కి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కేటిఆర్ ఏదేదో మాట్లాడుతున్నరని మండిపడ్డారు.
We’re now on WhatsApp. Click to Join.
కోట్లాది మంది మహిళలు బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తూ డబ్బులు పొదుపు చేసుకుంటున్నారని, 5 లక్షల ఆరోగ్య శ్రీ భీమా 10 లక్షల రూపాయలకు పెంచామని గుర్తు చేశారు. దీనివల్ల రోగులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఈరోజు వైద్యం చేయించుకుంటున్నారని మల్లు చెప్పుకొచ్చారు. రేపు 500 రూపాయలకు గ్యాస్ సిలెండర్స్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేయబోతున్నామని ప్రకటించారు. సీఎంగా రేవంత్ రెడ్డిని ముందు ప్రకటిస్తే 30 సీట్లు రాకపోయేవని కేటీఆర్ అనడం ఆయన దూరంహకారానికి పరాకాష్ట అన్నారు. ముందుగానే రేవంత్ రెడ్డి సీఎం అని కాంగ్రెస్ ప్రకటిస్తే బీఆర్ఎస్ కు 3 సీట్లు కూడా రాకపోయేవని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య యుతంగా పని చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ది కుటుంబ పార్టీ కాదని..ప్రజాస్వామ్య విలువలు నిండుగా ఉన్న పార్టీ అని తేల్చి చెప్పారు.
Read Also : Bathing Vs Peeing : స్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జన చేస్తున్నారా ?