HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Mallu Bhatti Vikramarka On White Paper

Mallu Bhatti Vikramarka: తెలంగాణ ఆర్థిక శ్వేతపత్రంపై బట్టి క్లారిటీ

తాము విడుదల చేసిన శ్వేతపత్రంలో ఎలాంటి తప్పులు లేవని భట్టి స్పష్టం చేశారు. గత బడ్జెట్ లెక్కలు, ఆర్‌బీఐ, కాగ్‌ల నుంచి సేకరించిన వివరాలతో నివేదికను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు తమకు శత్రువులు కాదని, ప్రత్యర్థులు మాత్రమేనని అన్నారు

  • Author : Vamsi Chowdary Korata Date : 21-12-2023 - 8:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bhatti
Bhatti

Mallu Bhatti Vikramarka: తాము విడుదల చేసిన శ్వేతపత్రంలో ఎలాంటి తప్పులు లేవని భట్టి స్పష్టం చేశారు. గత బడ్జెట్ లెక్కలు, ఆర్‌బీఐ, కాగ్‌ల నుంచి సేకరించిన వివరాలతో నివేదికను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు తమకు శత్రువులు కాదని, ప్రత్యర్థులు మాత్రమేనని అన్నారు. ఆంధ్రాకు చెందిన రిటైర్డ్ అధికారులతో శ్వేతపత్రం సిద్ధం చేశామన్న హరీశ్ రావు మాటలు సరికాదన్నారు. తెలంగాణ అధికారులను అవమానించేలా వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా అధికారులతో శ్వేతపత్రం సిద్ధం చేయాల్సిన అవసరం మాకు లేదు. సర్వీసులో ఉన్న తెలంగాణ అధికారులు చాలా నిష్ణాతులు. వారితో ఈ నివేదిక తయారు చేశాం. తెలంగాణ కేడర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌లపై మీకు నమ్మకం లేకపోతే ఆంధ్రా కేడర్‌ అధికారులను పిలిచి సీఎస్‌, డీజీపీ పోస్టులు ఇచ్చారు. వారిని సలహాదారులుగా నియమించారు అని విమర్శించారు.

2014 నుంచి 2023 వరకు బీఆర్‌ఎస్‌ హయాంలో రూపొందించిన వార్షిక బడ్జెట్‌లన్నీ వాస్తవాలకు దూరంగా ఉన్నాయని భట్టి అన్నారు. తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు. బడ్జెట్‌లో ఎక్కడైనా అంచనాలకు, వ్యయానికి మధ్య 5 శాతం తేడా ఉంటుంది. కానీ బీఆర్ఎస్ ఇచ్చే బడ్జెట్లలో కేటాయింపులు, ఖర్చుల మధ్య 20 శాతానికి పైగా వ్యత్యాసం ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్నాటక, కేరళ వంటి రాష్ట్రాల్లో బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు చేశామన్నారు.

రోజువారీ ఖర్చులకు కూడా ఓడీ (ఓవర్ డ్రాఫ్ట్)పై ఆధారపడాల్సిన పరిస్థితిని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని భట్టి మండిపడ్డారు. ఈ పరిస్థితి దురదృష్టకరమని భావిస్తున్నట్లు తెలిపారు. దశాబ్ద కాలంగా సాగుతున్న ఆర్థిక అరాచకాలు, తప్పిదాలను రాష్ట్ర ప్రజలందరికీ చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని, అందుకే శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. ప్రజల ఆకాంక్షలు, ఆశలు, కలలు నెరవేరేలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అందరికీ తెలియజేస్తున్నారు.

Also Read: Bigg Boss7: బిగ్ బాస్ పై హైకోర్టుకు సిపిఐ నారాయణ లేఖ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • congress
  • Mallu Bhatti Vikramarka
  • telangana
  • White Paper

Related News

Kavitha

KCR సభపై కవిత దారుణమైన కామెంట్స్

జగిత్యాల వేదికగా జరిగిన సభలో కేసీఆర్ ప్రసంగాన్ని ఉద్దేశించి కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతాంగ సమస్యలు, నిరుద్యోగం వంటి అనేక జ్వలంత సమస్యలు ఉన్నప్పటికీ, అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను

  • Jeevan Reddy Brs

    BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • Harish Rao Kmm

    Khammam : ఖమ్మం జిల్లా మంత్రులపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు

  • Pig Gives Birth To Elephant

    పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

  • Twins Same Marks in Intermediate Results 2026

    ఇంటర్ ఫలితాల్లో ఒకే మార్కులు సాధించిన కవలలు

Latest News

  • IPL 2026 – SRH Vs DC : ఢిల్లీ పై 47 రన్స్ తేడాతో SRH విజయం

  • TGSRTC Strike: అర్ధరాత్రి నుండి తెలంగాణలో బస్సులు బంద్

  • IPL 2026 – SRH Vs DC : అభిషేక్ మెరుపులు..DC కి 243 టార్గెట్

  • Good News : ఏపీకి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిన కేంద్రం

  • Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

Trending News

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd