Malla Reddy : రాజకీయాలకు మల్లారెడ్డి గుడ్ బై..
- Author : Sudheer
Date : 01-02-2024 - 11:03 IST
Published By : Hashtagu Telugu Desk
ఇకపై తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు మాజీ మంత్రి, మేడ్చల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలిపారు. మల్లారెడ్డి (Malla Reddy) గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు..మల్లన్న ఎంత మాటకారో చెప్పాల్సిన పనిలేదు. నిత్యం ఏదోకదానితో వార్తల్లో నిలువడం ఈయన ప్రత్యేకత. రాజకీయాల్లోనైనా , వ్యక్తిగతంగానైనా , వేడుక ఏదైనా సరే..మల్లారెడ్డా..మజాకానా అన్న తీరుగా ఈయన వ్యవహార శైలి ఉంటుంది. రీసెంట్ గా తెలంగాణ భవన్‌లో ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. బీజేపీలోకి పోతారని అంటున్నారని ఓ విలేఖరి మల్లారెడ్డి ని ప్రశ్నించగా..మీము బీజేపీలోకి పోతాం..కాంగ్రెస్ లోకి పోతాం,,అన్ని పార్టీలు మావే అంటూ తనదైన శైలి లో చెప్పుకొచ్చేసరికి అక్కడి వారంతా నవ్వుల్లో మునిగిపోయారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉండగా తాజాగా తాను రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలిపి షాక్ ఇచ్చాడు. ‘ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలే నా చివరివి. భవిష్యత్లో ఇకపై పోటీ చేయను. మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా. ప్రజలే నా బలగం.. కార్యకర్తలే నా కుటుంబం’ అని ఆయన పేర్కొన్నారు. మల్లారెడ్డి వ్యాఖ్యలు విని అంత షాక్ అయ్యారు.
మేడ్చల్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన మల్లారెడ్డి ఇదే తనకు చివరి టర్మ్ అని చెప్పారు. ప్రస్తుతం తన వయస్సు 71 ఏళ్లు అన్న మల్లారెడ్డి.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. తనకు అండగా నిలిచిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఓ సారి ఎంపీగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని.. కార్యకర్తలు, ప్రజల మద్దతుతో ఓ సారి మంత్రిని కూడా అయ్యారని గుర్తు చేసుకున్నారు మల్లారెడ్డి. నియోజకవర్గ ప్రజలకు 95 శాతం న్యాయం చేశానన్నారు మల్లారెడ్డి. భవిష్యత్తులోనూ ప్రజా సేవ చేస్తానన్నారు. తనకు కొడుకులు, కూతుళ్లు, బంధువులు ఎవరైనా నియోజకవర్గ ప్రజలేనని భావోద్వేగానికి గురయ్యారు.
రాజీకీయాల్లో ఇవే నా చివరి 5 ఏళ్లు – మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి pic.twitter.com/rfkc6WxPsD
— Telugu Scribe (@TeluguScribe) January 30, 2024
Read Also : Konda Surekha : వైఎస్ షర్మిలకు అండగా కొండా సురేఖ..?