HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Liquor Policy Case Ed Files Fresh Charge Sheet K Kavitha Named As Accused

Liquor Policy Case: ఢిల్లీ మద్యం కేసులో కవితను నిందితురాలిగా చేర్చిన ఈడీ

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం తాజా చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇందులో బీఆర్‌ఎస్ నాయకురాలు కవితను నిందితురాలిగా చేర్చారు.

  • Author : Praveen Aluthuru Date : 10-05-2024 - 5:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Liquor Policy Case
Liquor Policy Case

Liquor Policy Case: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం తాజా చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇందులో బీఆర్‌ఎస్ నాయకురాలు కవితను నిందితురాలిగా చేర్చారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ లోని సెక్షన్ 45 మరియు 44(1) కింద ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్టులో ప్రాసిక్యూషన్ ఫిర్యాదు దాఖలయ్యిందని నివేదికలు సూచిస్తున్నాయి.

అంతకుముందు కవిత బెయిల్ డిమాండ్ చేయడం గమనార్హం. దీనిపై ఢిల్లీ హైకోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సిబిఐ రెండింటికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మే 24న ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. అయితే ఈ సమయంలో ఈడీ కవితపై మరో ఛార్జ్ షీట్ నమోదు చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా, ఆప్‌ రాజ్యసభ ఎంపీ సంజయ్‌ సింగ్‌ సహా 18 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో తాజాగా ఆరో అనుబంధ చార్జిషీట్‌ కావడం గమనార్హం. మరోవైపు కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా, సంజయ్ సింగ్‌కు కొంతకాలం క్రితం సాధారణ బెయిల్ మంజూరైంది. ఈడీ కేజ్రీవాల్‌ను ఆయన అధికారిక నివాసం నుంచి పీఎంఎల్‌ఏ కింద మార్చి 21న అరెస్టు చేయగా, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమార్తె కవితను మార్చి 15న ఈడీ అదుపులోకి తీసుకుంది.

Also Read: Telangana : రేవంత్ రెడ్డి ఓ దోకేబాజ్ – డీకే అరుణ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cbi
  • charge sheet
  • court
  • delhi
  • ED
  • liquor policy case
  • MLC Kavitha

Related News

Kalvakuntla Kavitha

ఢిల్లీ మద్యం కేసు.. కవితకు CBI నోటీసులు

Kalvakuntla Kavitha  ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఎమ్మెల్సీ కవిత నివాసానికి సీబీఐ అధికారులు చేరుకుని హైకోర్టు నోటీసులు అందజేశారు. కింది కోర్టు ఇచ్చిన క్లీన్‌చిట్‌ను సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన అప్పీల్‌పై కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. గతంలో 164 రోజుల పాటు తిహార్ జైలులో ఉన్న కవిత.. ఇటీవలే విముక్తి పొందారు. తాజాగా సీబీఐ ఈ కేసులో విచారణను వేగవంతం చేయడంతో రాజకీయ వర్గాల్లో మళ్ళీ

    Latest News

    • టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ వీడియో రిలీజ్

    • శుభమన్ గిల్, హర్షిత్ రాణాకు బీసీసీఐ బెస్ట్ క్రికెటర్ అవార్డు!

    • Gas Cylinder Booking : గ్యాస్ సిలిండర్ రావాలంటే ఇలా చేయండి..

    • AP Electricity : ఏపీలో రికార్డు స్థాయికి విద్యుత్ వినియోగం

    • New Airports in Telangana : జూన్ లో 2 ఎయిర్పోర్టులకు శంకుస్థాపన?

    Trending News

      • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

      • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

      • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

      • ఇకపై వీరికి ఎల్‌పిజి సిలిండర్లు లభించవు!

      • ఏప్రిల్ 2026 శుక్ర గోచరం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd